విరాట్ కోహ్లీ,యువరాజ్ సింగ్ స‌ర‌స‌న శివ‌మ్ దుబే.. స‌రికొత్త రికార్డు !

By Mahesh Rajamoni  |  First Published Jan 12, 2024, 11:23 AM IST

Shivam Dube: తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘ‌నిస్తాన్ ను భార‌త్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో బాల్-బ్యాట్ తో అద‌ర‌గొట్టిన  భార‌త యంగ్ ప్లేయ‌ర్ శివ‌మ్ దుబే స‌రికొత్త రికార్డు సృష్టించాడు. దిగ్గ‌జ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, యువ‌రాజ్ సింగ్ ల స‌ర‌స‌న చేరాడు. 
 


Shivam Dube creates new record: మొహాలీ వేదిక‌గా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో భార‌త యంగ్ ప్లేయ‌ర్ శివమ్ దూబే అజేయ హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు బౌలింగ్ లో కూడా రాణించి ఒక ఒక వికెట్ తీశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ల స‌ర‌స‌న చేరాడు.

భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొద‌ట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘ‌న్ ప్లేయ‌ర్లు మహ్మద్ నబీ (42), ఒమర్జాయ్ (29) రాణించడంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం 159 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన భారత్ 17.3 ఓవర్లలో శివమ్ దూబే 60 పరుగులతో రాణించ‌డంతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది.  ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. దూబే 40 బంతుల్లో అజేయంగా 60 పరుగులు చేశాడు. దూబే ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 150 స్ట్రైక్ రేట్ తో గ్రౌండ్  పరుగుల వ‌ర‌ద పారించి స‌రికొత్త రికార్డు సృష్టించాడు.

Latest Videos

ఆ రనౌట్ లో తప్పెవరిది.. శుభ్‌మ‌న్ గిల్ పై రోహిత్ శర్మ ఫైర్ కావ‌డం క‌ర‌క్టేనా...?

అంతర్జాతీయ టీ20ల్లో హాఫ్ సెంచరీ, వికెట్ తీసిన నాలుగో ఆటగాడిగా శివమ్ దూబే చ‌రిత్ర సృష్టించాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించారు. యువరాజ్ సింగ్ 3 సార్లు, విరాట్ కోహ్లీ 2 సార్లు, హార్దిక్ పాండ్యా ఒక‌సారి ఈ ఘనత సాధించారు. బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొట్టారు. అద్భుత ప్రదర్శన చేసిన శివమ్ దూబేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆసియా గేమ్స్ 2023 తర్వాత శివ‌మ్ దూబే ఆడిన తొలి టీ20 ఇదే కావడం విశేషం.

బాల్, బ్యాటింగ్ లో ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన శివ‌మ్ దుబే మ్యాచ్ త‌ర్వాత మాట్లాడుతూ.. 'ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ మైదానంలో ఆడటాన్ని ఆస్వాదించాను. చాలా కాలం తర్వాత ఆడి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న నాపై కాస్త ఒత్తిడి ఉండేది. అదే సమయంలో నేను మెరుగైన ఆట‌ను ఆడాలని నా మనసులో ఉండేది. తొలి 2-3 బంతుల్లో కాస్త ఒత్తిడికి గురయ్యాను. టీ20ల్లో నేను ఎలా బ్యాటింగ్ చేస్తానో నాకు తెలుసు. నేను పెద్ద సిక్సర్లు కొట్టగలనని నాకు తెలుసు. అదే విధంగా బ్యాటింగ్ చేశాన‌ని' చెప్పాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా దుబే అద్భుతంగా ఆడాడ‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు.

India vs Afghanistan: త‌న డకౌట్ పై రోహిత్ శ‌ర్మ రియాక్ష‌న్ ఇదే.. !

click me!