Rohit Sharma: అఫ్గానిస్థాన్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్, ఎంఎస్ ధోనీలను రోహిత్ శర్మ అధిగమించాడు.
India vs Afghanistan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రోహిత్ చివరిసారిగా 2022 నవంబర్ లో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ తరఫున ఆడాడు. అప్పటి నుండి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీలు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 నేపథ్యంలో వన్డే క్రికెట్ కు ప్రాధాన్యం ఇచ్చి టీ20లకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మరో టీ20 వరల్డ్ కప్ సమీపిస్తుండటంతో వీరిద్దరూ తిరిగి టీమిండియా జట్టులోకి వచ్చారు. గురువారం మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20ల్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది. అయితే, టీ20లోకి రీఎంట్రీ ఇచ్చి పొట్టి ఫార్మాట్ లో భారత్ కు సారథ్యం వహించిన ఎక్కువ వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.
35 ఏళ్ల 236 రోజుల వయసులో 2021లో తన చివరి టీ20లో భారత్ కు నాయకత్వం వహించిన శిఖర్ ధావన్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 2016లో టీ20ల్లో కెప్టెన్ గా చివరి మ్యాచ్ ఆడిన ఎంఎస్ ధోనీ 35 ఏళ్ల 52 రోజులతో మూడో స్థానంలో ఉన్నాడు.
undefined
ఆ రనౌట్ లో తప్పెవరిది.. శుభ్‌మన్ గిల్ పై రోహిత్ శర్మ ఫైర్ కావడం కరక్టేనా...?
టీ20ల్లో భారత్‌కు ఎక్కువ వయస్కులైన కెప్టెన్లు
రోహిత్ శర్మ - 36 ఏళ్ల 256 రోజులు
శిఖర్ ధావన్ - 35 ఏళ్ల 236 రోజులు
ఎంఎస్ ధోని - 35 ఏళ్ల 52 రోజులు
సూర్యకుమార్ యాదవ్ - 33 ఏళ్ల 91 రోజులు
విరాట్ కోహ్లీ - 33 ఏళ్ల 03 రోజులు
ఇప్పటివరకు 13 మంది ఆటగాళ్ళు టీ20ల్లో భారత్ కు నాయకత్వం వహించారు. వీరిలో ఎక్కువ మంది 24 నుండి 36 మధ్య వయస్సు ఉన్నవారు ఉన్నారు. ఇక ఆఫ్ఘన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాట్, బాల్ తో రాణించిన శివమ్ దుబే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ,యువరాజ్ సింగ్ సరసన శివమ్ దుబే.. సరికొత్త రికార్డు !