Rohit Sharma Emotional Video: "ఐసీసీ వరల్డ్ ఫైనల్ మ్యాచ్ ఓటమి తర్వాత చాలా కష్టంగా అనిపించింది. ఎలా ముందుకు సాగాలో.. ఏం చేయాలో తెలియలేదు. కాలం ముందుకు సాగుతుంది. మనం ముందుకు సాగాలి. కానీ అంత త్వరగా మర్చిపోలేకపోతున్నా.." అంటూ భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు.
Rohit Sharma: ఇటీవల ముగిసిన ఐసీస వరల్డ్ కప్ 2023 తో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు తిరుగులేని విజయాలతో ఫైనల్ చేరుకుంది. అయితే, ఈ సారి మెగా టోర్నీ ట్రోఫీ మనదే అని భావిస్తున్న క్రమంలో ఊహించని విధంగా ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతితో భారత్ జట్టు ఓటమిపాలైంది. ఓటమి బాధను ఇప్పటికి యావత్ భారతావని గుర్తుంచుకుంది. మన క్రికెటర్లు సైతం కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై భారత స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. చాలా బాధకలించిన క్షణాలనీ, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని చెప్పారు. ఓటమి బాధ నుంచి బయటపడటం తనకు చాలా కష్టంగా మారిందని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తనకు సహకరించిన క్రికెట్ అభిమానులకు, స్టేడియానికి రోహిత్ కృతజ్ఞతలు తెలిపాడు. అభిమానులు తమపై ప్రేమాభిమానాలు కురిపిస్తూనే ఉన్నారనీ, ఏ చిన్న క్షణంలోనైనా వారి ప్రశంసలు తనకు తెలిసేలా చేశారని రోహిత్ వెల్లడించాడు. "ఐసీసీ వరల్డ్ ఫైనల్ మ్యాచ్ ఓటమి తర్వాత చాలా కష్టంగా అనిపించింది. ఎలా ముందుకు సాగాలో.. ఏం చేయాలో తెలియలేదు. కాలం ముందుకు సాగుతుంది. మనం ముందుకు సాగాలి. కానీ అంత త్వరగా మర్చిపోలేకపోతున్నా.." అంటూ భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు.
'ఫైనల్ తర్వాత, తిరిగి వచ్చి ముందుకు సాగడం చాలా కష్టం.. అందుకే నేను నా మనస్సును దీని నుండి బయటపడాలని నిర్ణయించుకున్నాను. కానీ అప్పుడు, నేను ఎక్కడ ఉన్నా, ప్రజలు నా వద్దకు వస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారని, మేము ఎంత బాగా ఆడామో నేను గ్రహించాను. వారందరి పట్ల నాకు ప్రేమ ఉంది. మాతో పాటు వారంతా ఆ ప్రపంచకప్ గెలవాలని కలలు కన్నారు' అని రోహిత్ తెలిపాడు. అలాగే, "ఈ మొత్తం ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా స్టేడియంకు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి, ఇంట్లో ఉండి టీవీల ద్వారా వీక్షించే ప్రజల నుంచి ఎంతో మద్దతు లభించింది. ఆ నెలన్నర కాలంలో ప్రజలు మా కోసం ఏం చేశారో అభినందిస్తున్నాను. కానీ మళ్లీ దాని గురించి ఆలోచిస్తే మేం అంతదూరం వెళ్లలేకపోయినందుకు చాలా నిరాశకు గురవుతాను' అని రోహిత్ పేర్కొన్నారు.
'నా దగ్గరకు వచ్చిన వాళ్లు జట్టును చూసి గర్వపడుతున్నారని చెప్పడం చూస్తుంటే నాకు మంచి ఫీలింగ్ కలిగింది. వారితో పాటు నేను కూడా కోలుకున్నాను. ఇలాంటివి మీరు వినాలనుకుంటున్న విషయాలు అని నేను భావించాను' అని రోహిత్ తెలిపాడు. "ప్రజలు, ఆటగాడు ఏమి అనుభవిస్తున్నాడో వారు అర్థం చేసుకున్నప్పుడు.. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు, ఆ నిరాశను, కోపాన్ని బయటకు తీసుకురావటానికి, అది మాకు చాలా ముఖ్యం. నాకు ఖచ్చితంగా కోపం లేదు, నేను కలుసుకున్న వ్యక్తుల నుండి స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. దానిని చూడటం అద్భుతంగా ఉంది. కాబట్టి ఇది తిరిగి రావడానికి.. తిరిగి పనిచేయడం ప్రారంభించడానికి.. మరొక అంతిమ బహుమతి కోసం చూడటానికి ప్రేరణ ఇస్తుందని" రోహిత్ శర్మ తెలిపారు.