దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సీరిస్ లో భారత యువకెరటం రింకూ సింగ్ అద్భుత బ్యాంటింగ్ తో అదరగొడుతున్నాడు. రెండో టీ20లో కేవలం ఒకే ఒక సిక్సర్ తో తన సత్తాఏంటో చాటాడు రింకూ.
రింకూ సింగ్... ఇప్పుడు టీమిండియాలో గట్టిగి వినిపిస్తున్న పేరు. దిగ్గజ క్రికెటర్ మహేంద్ర్ సింగ్ ధోని లాగే రింకూ కూడా అతి తక్కువ సమయంలోనే అత్యుత్తమ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. తనదైన ధనాధన్ బ్యాటింగ్ తో మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేయగల సత్తా అతడి సొంతం. చివరి ఓవర్లలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎంతటి ఒత్తిడినైనా తట్టకుని ఆడగలడు. ఇతడి విధ్వంసకర బ్యాటింగ్ కు రికార్డులే కాదు మైదానంలోని అద్దాలు సైతం బద్దలవుతున్నాయి.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సీరిస్ ఆడుతోంది. మొదటి 20 మ్యాచ్ వర్షం కారణంగా ఆటగాళ్ళు మైదానంలో అడుగుపెట్టకుండానే రద్దయ్యింది. ఇక రెండో టీ20 మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయ కలిగించింది... దీంతో అద్భుతంగా ఆడినా భారత్ కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ ను భారత్ ఓడినా యువకెరటం రింకూ సింగ్ తన ధనాధన్ బ్యాటింగ్ తో ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు. 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో ఏకంగా 68 పరుగులు చేసాడు రింకూ. ఈ ఇన్నింగ్స్ మొత్తం కాదు కేవలం ఒకే ఒక్క సిక్సర్ తో హీరో అయిపోయాడు రింకూ సింగ్.
సౌతాఫ్రికా బౌలర్ విసిరిన ఓ బంతిని అమాంతం బౌండరీ అవతలకు పంపించాడు రింకూ. అయితే రింకూ బాదిన బంతి నేరుగా మైదానంలోని ఓ కిటికీ అద్దాలకు తాకింది. దీంతో ఆ గ్లాస్ కాస్త పగిలిపోయింది. ఇలా రింకూ దెబ్బకు గ్లాస్ బద్దలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో 'రింకూ భాయ్... రికార్డులే అనుకుంటే ఇలా అద్దాలుకూడా బద్దలుగొడుతున్నావే' అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read Suryakumar Yadav: విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య కుమార్ .. ఇంతకీ ఆ రికార్డు ఏంటీ?
అయితే మొదటి ఇన్నింగ్ మరో మూడుబంతుల్లో ముగుస్తుందనగా వర్షం ఆటంకం సృష్టించింది. 19.3 ఓవర్లలో భారత జట్టు 180 పరుగులు చేసింది. 68 పరగులతో రింకూ నాటౌట్ గా నిలిచాడు. భారత ఇన్నింగ్స్ ముగుస్తుందనగా మొదలైన వర్షం చాలాసేపు కొనసాగింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 గా నిర్దేశించారు. ఈ టార్గెట్‌ని సఫారీలు ఏడు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు.
Maiden international FIFTY 👌
Chat with captain 💬
... and that glass-breaking SIX 😉 sums up his thoughts post the 2⃣nd T20I 🎥🔽 pic.twitter.com/Ee8GY7eObW
ఈ టీ20 లో భారత్ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఓపెనర్లు శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యారు. ఇలా ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (56 పరుగులు), తిరల్ వర్మ(29) ఆదుకున్నారు. ఇక తిలక్ వర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రింకూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇలా కేవలం 39 బంతుల్లోనే 68 పరుగులు చేసి భారత్ కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మాత్రం ఓపెనర్లు శుభారంభం అందించారు. కేవలం 3 ఓవర్లలోనే ఆ జట్టు స్కోరు 41 పరుగులకు చేరుకుంది. మొదటి వికెట్ 2.5 ఓవర్లలోనే పడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. మొదటి వికెట్ పడినా ఆ తర్వాత రెండో వికెట్‌కు రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 30 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనేక మలుపుల తర్వాత విజయం ఆతిథ్య సౌతాఫ్రికానే వరించింది.