ICC rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపుతున్న భారత ప్లేయర్లు

Published : Jul 03, 2025, 04:50 PM IST
Rishabh Pant. (Photo- @BCCI X)

సారాంశం

ICC rankings: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ మొదటిసారిగా టాప్ 10లోకి వచ్చాడు.

ICC Test rankings: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజా పురుషుల టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ భారత్ ప్లేయర్లు దుమ్మురేపారు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్‌లు మరిన్ని స్థానాలు మెరుగుపర్చుకుని టాప్ 10 లోకి దూసుకొచ్చారు.

హెడ్డింగ్లీలో రెండు సెంచరీలు బాదిన రిషబ్ పంత్

ఇంగ్లాండ్‌తో హెడ్డింగ్లీ వేదికగా జరిగిన మొదటి టెస్టులో రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు బాది అరుదైన రికార్డును సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశారు. ఈ అద్భుత ప్రదర్శనతో పంత్ ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పలు స్థానాలు మెరుగుపరుచుకుని 6వ స్థానానికి చేరారు. ఇప్పుడు పంత్ 801 రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్నాడు.

ఈ ర్యాంకింగ్స్ లో 889 పాయింట్లతో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్ స్టార్ హ్యారీ బ్రూక్, న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ లు ఉన్నారు.

 

 

భారత వికెట్ కీపర్ గా పంత్ కొత్త రికార్డు

ఇదివరకూ ఏ భారత వికెట్ కీపర్ కూడా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 800 రేటింగ్ పాయింట్లకు చేరలేదు. పంత్ ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఫార్మాట్ ఏదైనా స్థిరతమైన ప్రదర్శనలు ఇవ్వడం, ఒత్తిడిలోనూ పరుగులు చేయగల సామర్థ్యం వల్ల పంత్ జట్టులోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా అగ్రశ్రేణి ఆటగాడిగా నిలిచాడు.

ట్రావిస్ హెడ్‌కు టాప్ 10లో తొలి ప్రవేశం

ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ వెస్టిండీస్ తో బార్బడోస్‌లో జరిగిన టెస్టులో 59, 61 పరుగులతో మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఈ విజయం ఆస్ట్రేలియాకు ఆధిపత్య విజయాన్ని అందించడమే కాకుండా, హెడ్‌ను మూడు స్థానాలు పైకి చేర్చింది. ఈ మేరకు ఆయన తొలిసారిగా టాప్ 10 టెస్టు బ్యాట్స్‌మన్‌ల జాబితాలోకి ప్రవేశించారు.

పడిపోతున్న సీనియర్ ప్లేయర్ల ర్యాంకులు

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 816 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఒకప్పుడు 947 పాయింట్లతో టాప్‌లో ఉన్న ఆయన ఇప్పుడు ఐదో స్థానానికి పరిమితమయ్యాడు.

అలాగే, కీవీస్ స్టార్ కేన్ విలియమ్సన్ 867 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ కొత్త ఆటగాళ్ల ప్రదర్శనలతో ఒత్తిడికి లోనవుతున్నాడు.

ఈసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10 లో మూడు కొత్త పేర్లు చేరాయి.

దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా 798 పాయింట్లతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. బెన్ డకెట్ 787 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. ఈ యంగ్ ప్లేయర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకు రన్ మిషన్ గా మారాడు. కమిందు మెండిస్ 781 రేటింగ్ పాయింట్లతో శ్రీలంక తరఫున మెరుగైన టెస్ట్ ప్రదర్శనలు ఇస్తున్న ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సింహం ఒక్క అడుగు వెనక్కి.. కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడతానన్నది ఇందుకేనా.?
గుర్తుపెట్టుకో.! 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆ ఇద్దరినీ ఎవరూ ఆపలేరు.!