Latest Videos

విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు.. పోలీసులు అల‌ర్ట్..

By Mahesh RajamoniFirst Published May 22, 2024, 5:31 PM IST
Highlights

Virat Kohli's security threat: టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు అందిన సమాచారంతో ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌ జరుగుతున్న అహ్మ‌దాబాద్ స్టేడియంలో భద్రతను పెంచారు.
 

Virat Kohli's security threat: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ లో జ‌రుగుతున్న మ్యాచ్ ల సంద‌ర్భంగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో ఎలిమినేటర్ పోరుకు సిద్ధంగా ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). ఈ కీల‌క మ్యాచ్ కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ప్రాణాల‌కు ముప్పు ఉంద‌నే స‌మాచారం అందుకున్న గుజ‌రాత్ పోలీసులు మ్యాచ్ జ‌రుగుతున్న అహ్మ‌దాబాద్ స్టేడ‌యంలో భారీగా భ‌ద్ర‌త‌ను పెంచారు. ఈ కీల‌క మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ భద్రత దృష్ట్యా ఫ్రాంచైజీ తన ఏకైక వార్మప్ సెష‌న్ ను కూడా ర‌ద్దుచేసుకుంది.

భ‌ద్ర‌తా ఆందోళ‌న మ‌ధ్య వార్మ‌ప్ సెషన్ రద్దు చేయవలసి వచ్చిందని తెలిపింది. విరాట్ కోహ్లీ భద్రతపై ఆందోళనలు తలెత్తాయి.. దీని కారణంగా ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ కు ముందు మంగళవారం అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాలేజ్ గ్రౌండ్‌లో ఆర్సీబీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. ప‌లు మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. భద్రతా ముప్పు కారణంగా రాజ‌స్థాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా బెంగ‌ళూరు ఫ్రాంఛైజీ విలేకరుల సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. ఈ అసాధారణ పరిణామంతో చాలా మంది షాక్ అయ్యార‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

మాజీ క్రికెట‌ర్ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన షారుక్ ఖాన్.. నిజంగా నువ్వు గ్రేట్ బాసు..

మ‌రో నివేదిక ప్ర‌కారం.. ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్, మీడియా సమావేశాన్ని రద్దు చేయడం వెనుక ప్రధాన కారణం విరాట్ భద్రత అని గుజరాత్ పోలీసులు సూచించారు. అహ్మదాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజ‌రాత్ పోలీసులు మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ జాతీయ నిధి అనీ, అత‌ను భ‌ద్ర‌త త‌మ మొద‌టి ప్రాధాన్య‌త అని తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఆర్సీబీ ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోలేదనీ, ప్రాక్టీస్ సెషన్‌లు ఉండవని చెప్పిన‌ట్టు పేర్కొన్నారు. ఆర్సీబీ బ‌స చేస్తున్న హోటల్ బయట కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐపీఎల్ అనుబంధ సభ్యులను కూడా టీమ్ హోటల్‌లోకి అనుమతించలేదని సమాచారం.

మంచి ఊపులో ర‌నౌట్ .. బోరున ఏడ్చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయ‌ర్

 

click me!