
Virat Kohli breaks Shikhar Dhawan record : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)-పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తలపడ్డాయి.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక పోరులో కోహ్లీ తన తొలి బౌండరీ కొట్టిన క్షణంలోనే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు సాధించిన బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్ ప్రారంభంలో ఆర్‌సీబీ బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కైల్ జేమీసన్ వేసిన మూడో ఓవర్లో తొలి బౌండరీ కొట్టి, శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టాడు. మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఇద్దరూ 768 ఫోర్లతో సమంగా ఉన్నారు. ఇప్పుడు 769 ఫోర్లతో విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు.
ధావన్ ఈ ఘనతను 222 ఇన్నింగ్స్‌లలో సాధించగా, కోహ్లీకి ఇది 258వ ఇన్నింగ్స్. డేవిడ్ వార్నర్ 184 మ్యాచ్‌లలో 663 ఫోర్లు కొట్టి మూడో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత రోహిత్ శర్మ (640 ఫోర్లు), అజింక్యా రహానే (514 ఫోర్లు)లు ఉన్నారు.
విరాట్ కోహ్లీ: 267 మ్యాచ్‌ల్లో 769* ఫోర్లు
శిఖర్ ధావన్: 222 మ్యాచ్‌ల్లో 768
డేవిడ్ వార్నర్: 184 మ్యాచ్‌ల్లో 663
రోహిత్ శర్మ: 272 మ్యాచ్‌ల్లో 640
అజింక్య రహానే: 172 మ్యాచ్‌ల్లో 514
కోహ్లీ ఈ సీజన్‌లోనూ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు 14 ఇన్నింగ్స్‌లలో 614 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.