
IPL 2025 Final RCB vs PBKS: ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్‌లో టెయిల్స్ పిలిచి విజయం సాధించాడు. దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెఫర్డ్, పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ హేజిల్ వుడ్.
ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జేమిసన్, విజయ్ కుమార్ వైశాక్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
RCB ఇంపాక్ట్ సబ్‌లు: రసిఖ్ సలాం, మనోజ్ భండగే, టిమ్ సెఫర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ
PBKS ఇంపాక్ట్ సబ్‌లు: ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జెవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. " టాస్ గెలిస్తే మేమూ కూడా బౌలింగ్‌నే ఎంచుకునే వాళ్లం. పిచ్ గట్టి కనిపిస్తోంది. మంచి స్కోరు చేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నాం. ఇప్పటివరకు బాగానే ఆడాం. ఇది పెద్ద వేదిక అయినా, మాకైతే మరో అవుట్‌డోర్ గేమ్ లాంటిదే. జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతున్నాము" అని తెలిపాడు.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. "బౌలింగ్ ముందుగా చేయాలనుకుంటున్నాము. నా శరీరం, మనసుకి పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వాలనే లక్ష్యంతో వచ్చాం. స్టేడియంలో గాలి నిండి ఉంది. మన బాయ్స్ మంచి మైండ్‌సెట్‌లో ఉన్నారు. జట్టు మీటింగ్‌లో చర్చించిన ప్రధాన విషయం.. గెలుపు కోసం శాంతంగా ఉంటే, అంత మంచే జరుగుతుంది. ఇది ఫైనల్ అని తెలుసు. ఫైనల్‌లానే ఆడతాము" అని చెప్పాడు.
పంజాబ్ కింగ్స్ మొదట బౌలింగ్ చేస్తోంది. పిచ్ ఫ్లాట్‌గా ఉండటంతో ఇది భారీ స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశముంది. 2025 టైటిల్ కోసం పోటీపడుతున్న ఇరు జట్లకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. IPL చరిత్రలో తమ మొదటి ట్రోఫీ గెలవాలని ఆశపడుతున్న పంజాబ్, బెంగళూరు అభిమానుల ఉత్కంఠ మరో స్థాయికి చేరుకుంది.