RCB vs CSK: టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ తొలి భారతీయుడిగా మ‌రో ఘ‌న‌త‌..

By Mahesh Rajamoni  |  First Published Mar 22, 2024, 9:48 PM IST

RCB vs CSK: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో బెంగ‌ళూరు-చెన్నై జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఆర్సీబీ మొద‌ట బ్యాటింగ్ చేయ‌గా, కింగ్ విరాట్ కోహ్లీ 21 ప‌రుగులు చేసి టీ20 క్రికెట్ లో స‌రికొత్త రికార్డు సృష్టించాడు.
 


Virat Kohli : ఐపీఎల్ 2024  తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జ‌రిగింది. ఈ మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగ‌ళూరు టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తో క‌లిసి స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడ‌లేక‌పోయాడు. 21 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. 

అయితే,  మ్యాచ్ తో టీ20 క్రికెట్ లో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 12,000 పరుగుల మైలురాయిని కోహ్లి అధిగ‌మించాడు. ఈ ఘ‌న‌త సాధించిన‌ మొదటి భారతీయ ప్లేయ‌ర్ గా, మొత్తంగా ఆరవ ఆటగాడిగా కింగ్ కోహ్లీ నిలిచాడు. అలాగే, ఐపీఎల్‌లో 7000 పరుగుల మార్క్‌ను అధిగమించిన ఏకైక ఆటగాడు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఒక సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా కూడా కోహ్లీ రికార్డు సృష్టించారు. 2016 లో అద్భుతమైన ఆట‌తో దుమ్మురేపుతూ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఒక సీజన్‌లో 973 పరుగులు చేశాడు.

Latest Videos

undefined

IPL Opening Ceremony: త్రివర్ణ ప‌తాకంతో.. ఆర్మీ క్యాస్టుమ్ స్టైల్లో దుమ్మురేపిన అక్ష‌య్ కుమార్

టీ20 క్రికెట్ లో 12 వేల ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు వీరే..

  1. క్రిస్ గేల్ - 14562
  2. షోయబ్ మాలిక్ - 13360
  3. కీరన్ పొలార్డ్ - 12900
  4. అలెక్స్ హేల్స్ - 12319
  5. డేవిడ్ వార్నర్ - 12065
  6. విరాట్ కోహ్లీ - 12015

 

First Indian to reach the 12000 T20 runs milestone 🫡 pic.twitter.com/Dh5rCn6nzl

— Royal Challengers Bengaluru (@RCBTweets)

RCB VS CSK: ఆరంభం అదిరింది కానీ.. 

click me!