IPL 2024: టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఫామ్‌లోకి.. రోహిత్ శర్మ సూప‌ర్ హాఫ్ సెంచ‌రీ

By Mahesh Rajamoni  |  First Published May 18, 2024, 1:17 AM IST

MI vs LSG: ల‌క్నో సూపర్ జెయింట్స్ తో ముంబై ఇండియ‌న్స్  ఐపీఎల్ 2024 సీజన్ లో చివ‌రి మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు హిట్ మ్యాన్ తన ఫామ్ ఆందోళ‌న‌ల‌కు తెర‌దించాడు.
 


LSG vs MI Rohit Sharma : ఐపీఎల్ 2024 76వ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో భారీ స్కోర సాధించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 55 ప‌రుగులు త‌న ఇన్నింగ్స్ లో 3 సిక్స‌ర్లు, 3 ఫోర్లు బాదాడు. స్టోయినిస్ 28 ప‌రుగులు చేశాడు. నికోల‌స్ పూర‌న్ మ‌రోసారి త‌న బ్యాటింగ్ విధ్వంసం చూపించాడు. వ‌స్తువ‌స్తూనే ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ముంబై పై విరుచుకుప‌డ్డాడు. కేవ‌లం 29 బంతుల్లోనే 8 సిక్స‌ర్లు, 5 ఫోర్ల‌తో 75 ప‌రుగుల సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ల‌క్నో 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 214 ప‌రుగులు చేసింది.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ముందు ఫామ్ లోకి హిట్ మ్యాన్ 

Latest Videos

ఐపీఎల్ ప్లేఆఫ్స్ ద‌శ‌కు చేరుకున్న క్ర‌మంలో ఇప్పుడు అందరి చూపు టీ20 ప్రపంచకప్‌పై కూడా ప‌డింది. ముఖ్యంగా టీమిండియా ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు హాట్ టాపిక్ గా మారియి. మ‌రీ ముఖ్యంగా ప్ర‌పంచ క‌ప్ లో భార‌త జ‌ట్టును ముందుకు న‌డిపంచ‌బోయే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ పై ఆందోళనలు ఉన్నాయి. ఐపీఎల్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ చేసినప్పటికీ, అతను ఫామ్‌లో కనిపించలేదు. అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు ముంబై ఐపీఎల్ చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన ఫామ్‌లోకి వచ్చాడు. 

ఐపీఎల్ 2024లో ముంబై, లక్నో జట్లు ప్లే ఆఫ్ రేసులో కానీ, ఇరుజ‌ట్లు ఈ సీజ‌న్ లో త‌మ చివ‌రి మ్యాచ్ ను శుక్ర‌వారం ఆడాయి. వాంఖడేలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో 214 పరుగులు చేసింది. భారీ స్కోరు ఛేజింగ్ కు దిగిన ముంబై కి రోహిత్ శ‌ర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ల‌క్నో బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతూ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. మ‌రో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. రోహిత్ శ‌ర్మ 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. టీ20 ప్ర‌పంచ క‌ప్ కు ముందు త‌న ఫామ్ ఆదోళ‌న‌ల‌ను ఔట్ చేశాడు. 

హార్దిక్-సూర్య విఫలం.. ముంబైకి త‌ప్ప‌ని ఓట‌మి

ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా టీ20 ప్రపంచకప్ 2024 భార‌త జ‌ట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో హార్దిక్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. కెప్టెన్ గానూ ప‌లు త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. అలాగే, సూర్య కుమార్ యాద‌వ్ కూడా గత కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమవుతున్నాడు. అయితే, ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 3 ఫిఫ్టీ, ఒక సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చివరి మ్యాచ్‌లో సూర్య ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇక హార్దిక్ పాండ్యా 16 పరుగులు మాత్రమే చేసి మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు.

MI VS LSG : హోం గ్రౌండ్ లోనూ ఎల్ఎస్జీ చేతిలో చిత్తుగా ఓడిన హార్దిక పాండ్యా టీమ్ ముంబై

click me!