RCBvsCSK: ‘స్పార్క్’ చూపించిన రుతురాజ్... చెన్నై సూపర్ కింగ్స్ ఈజీ విక్టరీ...

Published : Oct 25, 2020, 06:44 PM IST
RCBvsCSK: ‘స్పార్క్’ చూపించిన రుతురాజ్... చెన్నై సూపర్ కింగ్స్ ఈజీ విక్టరీ...

సారాంశం

అద్భుత హాఫ్ సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్...  39 పరుగులు చేసిన అంబటి రాయుడు...  

IPL 2020: కుర్రాళ్లలో స్పార్క్ లేదని మహేంద్ర సింగ్ ధోనీ చేసిన కామెంట్‌కి తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు సీఎస్‌కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్. సీనియర్ బ్యాట్స్‌మెన్ డుప్లిసిస్ 25 పరుగులకే అవుటైనా... అద్భుత హాఫ్ సెంచరీతో సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. 146 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్లు రుతురాజ్, డుప్లిసిస్ శుభారంభం అందించారు.

మొదటి వికెట్‌కి 46 పరుగులు జోడించిన తర్వాత 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన డుప్లిసిస్‌, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అంబటిరాయుడితో కలిసి రెండో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

అంబటి రాయుడు 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ 19 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో యజ్వేంద్ర చాహాల్‌, క్రిస్ మోరిస్ చెరో వికెట్ తీశారు.

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది