RCBvsCSK: విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్... చెన్నై సూపర్ కింగ్స్ ముందు ఈజీ టార్గెట్...

Published : Oct 25, 2020, 05:04 PM IST
RCBvsCSK: విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్... చెన్నై సూపర్ కింగ్స్ ముందు ఈజీ టార్గెట్...

సారాంశం

మరోసారి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్... 39 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్... హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ...  

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, 145  పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ 15 పరుగులు చేసి అవుట్ కాగా దేవ్‌దత్ పడిక్కల్ 22 పరుగులు చేశాడు. 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ కలిసి మూడో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

36 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసి ఏబీ డివిల్లియర్స్ అవుట్ కాగా... మొయిన్ ఆలీ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. 43 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. క్రిస్ మోరిస్ 2, వాషింగ్టన్ సుందర్ 5 పరుగులు చేశాడు.

ఏబీ డివిల్లియర్స్ అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ భారీ స్కోరు చేయలేపోయింది. చెన్నై బౌలర్లలో సామ్ కుర్రాన్ మూడు, దీపక్ చాహార్ 2 వికెట్లు తీశారు. 

 


 

PREV
click me!

Recommended Stories

SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !
IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ