ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కపిల్ దేవ్

By Siva KodatiFirst Published Oct 25, 2020, 4:21 PM IST
Highlights

గుండెపోటుకు గురై ఆస‍్పత్రిలో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఆదివారం  డిశ్చార్జ్‌ చేశారు.

గుండెపోటుకు గురై ఆస‍్పత్రిలో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఆదివారం  డిశ్చార్జ్‌ చేశారు. ఇటీవల కపిల్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా అదే రోజు రాత్రి వైద్యులు ఆయనకు ఆపరేషన్‌ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్‌ చేసినట్లు మాజీ క్రికెటర్‌ చేతన్‌శర్మ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కపిల్‌ దేవ్‌ ఆస్పత్రి వైద్యుడితో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘వైద్యుడు అతుల్ మాథుర్ కపిల్ పాజీకి యాంజియోప్లాస్టీ చేశాడు.

ప్రస్తుతం కపిల్‌ కోలుకోవడంతో ఈ రోజు ఉదయం ఆయనను డిశ్చార్జ్‌ చేశారు’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా కపిల్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులతో పాటు, పెద్ద ఎత్తున సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తమ అభిమాన ఆటగాడు‌ త్వరగా కోలుకుని, క్షేమంగా తిరిగి రావాలని అందరూ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హర్యానా హరికేన్‌ శనివారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, క్షేమంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ‍్క్షతలు తెలిపారు.
 

click me!