RCB vs CSK: ఎంది గురూ ఇలా ఔట్ చేశారు.. అద్భుత రిలే క్యాచ్ తో కోహ్లీని పెవిలియ‌న్ కు పంపిన ర‌హానే, ర‌చిన్..

By Mahesh Rajamoni  |  First Published Mar 22, 2024, 10:34 PM IST

RCB vs CSK: ఐపీఎల్ 2024  తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జ‌రిగింది. ఈ మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ క్యాచ్ ఔట్ అయిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.
 


mind-blowing relay catch to dismiss Virat Kohli: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో ఐపీఎల్ 2024 లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న గేమ్‌లో విరాట్ కోహ్లీని అద్భుత‌మైన రిలే క్యాచ్ తో చెన్నై టీమ్ పెవిలియ‌న్ కు పంపింది. అజింక్య రహానే సూప‌ర్ క్యాచ్.. బౌండ‌రీ వ‌ద్ద లైన్ దాటే ప‌రిస్థితి ఉండ‌టంతో వెంట‌నే బాల్ ను మ‌రో ప్లేయ‌ర్ కు వేయ‌డంతో గొప్ప‌ అథ్లెటిసిజం చూపించాడు.

ఫాఫ్ డు ప్లెసిస్-విరాట్ కోహ్లీలు ఆర్సీబీకి అద్భుత‌మైన ఆరంభాన్ని అందించారు. వీరిద్ద‌రు 41 పరుగుల భాగ‌స్వామ్యం అందించారు. అయితే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐదో ఓవర్‌లో కెప్టెన్ డుప్లెసిస్, రజత్ పాటిదార్‌ను అవుట్ చేసి మ్యాచ్ ను సీఎస్కే వైపు తిప్పాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే ప్రమాదకరమైన గ్లెన్ మాక్స్‌వెల్‌ను వెనక్కి పంపాడు దీపక్ చాహర్. దీంతో ఆర్సీబీ 42 ప‌రుగుల వ‌ద్ద‌ 3 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లి-కామెరూన్ గ్రీన్ క్రీజులో ఉన్నారు.

Latest Videos

నెమ్మ‌దిగా ఆడుతున్న విరాట్ కోహ్లీ గేర్ మార్చి వేగం పెంచాడు. ఈ క్ర‌మంలోనే భారీ షాట్ కొట్ట‌గా బౌండ‌రీ లైన్ వ‌ద్ద‌ అజింక్యా రహానే అద్భుతమైన క్యాచ్.. దానిని రిలే క్యాచ్ గా ర‌చిన్ ర‌వీంద్ర అందుకోవ‌డంతో పెవిలియ‌న్ కు చేరాడు. 11 ఓవర్ రెండో బంతికి, బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ పుల్ కోసం వెళ్లాడు. భారీ షాట్ కొట్టాడు. అయితే, బౌండ‌రీని దాట‌లేక‌పోయింది. బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఉన్న అజింక్యా ర‌హానే అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టాడు. అయితే, క్యాచ్ ప‌ట్టిన వేగం బౌండ‌రీ లైన్ లోకి వెళ్లే ప‌రిస్థితి గుర్తించిన ర‌హానే.. వెంట‌నే స్పందించి త‌న చేతిలోని బాట్ ను ప‌క్క‌నే ఉన్న ర‌చిన్ ర‌వీంద్ర‌కు విసిరాడు. దీంతో విరాట్ కోహ్లీ 21 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు.  ప్ర‌స్తుతం ఈ క్యాచ్ దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

 

Must-watch Fizur! 🔥🔥 🦁💛

pic.twitter.com/STh4WsZ8EU

— Chennai Super Kings (@ChennaiIPL)

RCB VS CSK: టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ తొలి భారతీయుడిగా మ‌రో ఘ‌న‌త‌.. 

click me!