
India vs England - Ravindra Jadeja: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాండ్ తొలి టెస్టులో భారత టార్గెట్ ను ఛేదించడంలో ఎదురీదుతోంది. 231 పరుగుల స్వల్ప టార్గెత్ బరిలోకి దిగిన భారత్ కు రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లు మంచి ఆరంభం అందించినా మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్ స్పిన్నర్లకు వికెట్ల ముందు దొరికిపోతూ వరుసగా పెవిలియన్ కు క్యూకట్టారు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ బాల్, బ్యాట్ తో రాణించిన రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్ లో కేవలం రెండు పరులు మాత్రమే చేసి రనౌట్ గా వెనుదిరిగాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ అద్భుతమైన ఫీల్డింగ్ తో బాల్ ను నేరుగా వికెట్లకు కొట్టడంతో జడేజా రనౌట్ గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా 87 పరుగులు చేసి భారత్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే, బౌలింగ్ లో తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, రెండో ఇన్నింగ్స్ లో 1 వికెట్ తీసుకున్నాడు. భారత్ కష్ట సమయంలో.. గెలుపు ఆశలన్ని జడేజా పై పెట్టుకున్న సమయంలో క్రీజులోకి వచ్చిన ఈ స్టార్ ఆల్ రౌండర్ 20 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి రనౌట్ ఆయ్యాడు. రవీంద్ర జడేజా తన టెస్టు క్రికెట్ కెరీర్ లో రనౌట్ కావడం ఇదే తొలిసారి.
IND VS ENG: అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ !