రవీంద్ర జడేజా బుల్లెట్ త్రో... అద్బుతమైన డైవింగ్ క్యాచ్... కష్టాల్లో పంజాబ్...

Published : Apr 16, 2021, 08:21 PM IST
రవీంద్ర జడేజా బుల్లెట్ త్రో... అద్బుతమైన డైవింగ్ క్యాచ్... కష్టాల్లో పంజాబ్...

సారాంశం

అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో కెఎల్ రాహుల్‌ను రనౌట్ చేసిన రవీంద్ర జడేజా... రవీంద్ర జడేజా పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌‌కి క్రిస్ గేల్ అవుట్... నాలుగు వికెట్లు తీసిన దీపక్ చాహార్...

టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ కింగ్స్, 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గత మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన దీపక్ చాహార్, కెరీర్ బెస్ట్ స్పెల్‌తో పంజాబ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు.

మయాంక్ అగర్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన దీపక్ చాహార్, సీఎస్‌కేకి తొలి బ్రేక్ అందించాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా వేసిన ఓ బుల్లెట్ త్రోకి కెఎల్ రాహుల్ రనౌట్ అయ్యాడు...

ఆ తర్వాత 10 పరుగులు చేసిన ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌ను కూడా కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు రవీంద్ర జడేజా. ఆ తర్వాత నికోలస్ పూరన్ డకౌట్ కాగా, దీపక్ హుడా 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

పంజాబ్ కోల్పోయిన 5 వికెట్లలో నాలుగు దీపక్ చాహార్ పడగొట్టగా, ఒకటి రనౌట్... 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు దీపక్ చాహార్. 
 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: ఫైనల్‌కు వచ్చేది ఆ జట్టే.. తాట తీస్తారు కాచుకోండి.! ఇది పే..ద్ద వార్నింగే
IND vs ENG : సెమీస్‌లో భారత్‌కు అసలైన ముప్పు.. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు !