నీళ్లు మోస్తున్నా, లేదంటే నీళ్లు మీద తేలుతున్నా... ఐపీఎల్ జర్నీపై జిమ్మీ నీశమ్ ఫన్నీ పోస్ట్...

Published : Apr 16, 2021, 08:02 PM IST
నీళ్లు మోస్తున్నా, లేదంటే నీళ్లు మీద తేలుతున్నా... ఐపీఎల్ జర్నీపై జిమ్మీ నీశమ్ ఫన్నీ పోస్ట్...

సారాంశం

ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న ముంబై ఇండియన్స్... పటిష్టమైన ప్లేయర్లతో నిండిన ముంబై ఇండియన్స్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న జేమ్స్ నీశమ్..

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీశమ్, సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. ఫన్నీ ఫన్నీ పోస్టులతో, ఫన్నీ కామెంట్లతో నెటిజన్లను ఆకట్టుకునే జిమ్మీ నీశమ్... మరోసారి ఓ ఫన్నీ పోస్టుతో ఐపీఎల్ ఫ్యాన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు.

గత సీజన్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన జెమ్స్ నీశమ్‌ను, ముంబై ఇండియన్స్ బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పటిష్టమైన ప్లేయర్లతో నిండిన ముంబై ఇండియన్స్, జేమ్స్ నీశమ్‌కి ఇప్పటిదాకా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.

 

దీంతో చెన్నైలో తన సహచర ఆటగాడు క్రిస్‌లీన్‌తో కలిసి సర్ఫింగ్ చేశాడు జేమ్స్ నీశమ్. సర్ఫింగ్ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన జేమ్స్ నీశమ్... ‘ఐపీఎల్ 2021 ఇప్పటిదాకా ఎలా ఉందంటే... నీళ్లు మోస్తున్నా... లేదంటే నీళ్లపైన తేలుతున్నా’ అంటూ కామెంట్ జత చేశాడు.  

PREV
click me!

Recommended Stories

తెలుగోడికి హ్యాండ్ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. ఏంటి కావ్య పాప.! రూ. 75 లక్షలు కూడా లేవా..
INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం