అతని కరోనా రిపోర్టులో తప్పులు... ఢిల్లీ క్యాపిటల్స్‌కి గుడ్‌న్యూస్...

Published : Apr 16, 2021, 04:35 PM IST
అతని కరోనా రిపోర్టులో తప్పులు...  ఢిల్లీ క్యాపిటల్స్‌కి గుడ్‌న్యూస్...

సారాంశం

నోకియాకి పాజిటివ్‌గా వచ్చిన రిపోర్ట్‌లో తప్పులు జరిగాయని తేల్చిన వైద్యులు... వరుసగా మూడు కరోనా పరీక్షల్లోనూ నోకియా నెగిటివ్ రిజల్ట్... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిసిన సఫారీ పేసర్...

మొదటి మ్యాచ్‌లో గెలిచినా, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఊరటనిచ్చే విషయం ఇది. కరోనా బారిన పడిన ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రీచ్ నోకియా... కోవిద్ నుంచి కోలుకున్నాడు.

కొన్నిరోజుల క్రితం నోకియాకి కరోనా పాజిటివ్‌గా వచ్చిన రిపోర్టులో తప్పులు ఉన్నాయని తేల్చారు వైద్యులు. అతనికి చేసిన కరోనా పరీక్షల్లో మూడుసార్లు నెగిటివ్ రావడంతో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిశాడు నోకియా...

క్వారంటైన్ పూర్తిచేసుకున్న నోకియా, తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున బరిలో దిగబోతున్నాడు. నోకియాకి కరోనా పాజిటివ్ రావడంతో అతని స్థానంలో టామ్ కుర్రాన్‌కి జట్టులో చోటు కల్పించాడు రిషబ్ పంత్. అయితే రెండు మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమైన టామ్ కుర్రాన్ స్థానంలో నోకియా ఎంట్రీ ఇవ్వడం ఖాయం కావచ్చు.

PREV
click me!

Recommended Stories

RCB vs CSK: సీఎస్కే కథ కంచికే.. కోహ్లీ టీమ్ ఆర్సీబీ కొట్టిన దెబ్బకు ధోనీ టీమ్ విలవిల !
Tim David : ఇది కదా ఊరమాస్ అంటే! ఒకే ఓవర్‌లో 30 రన్స్.. 8 సిక్సర్లతో చెన్నై బెంబేలు !