Ravindra Jadeja Triple Century: కాన్పూర్‌లో జరిగిన రెండో, చివరి టెస్టులో భారత క్రికెట్ జట్టు ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంలో రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, బుమ్రా, జైస్వాల్ కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో జడేజా మరో ఘతన సాధించాడు.
Ravindra Jadeja Triple Century: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరిగిన రెండో-చివరి టెస్టులో భారత క్రికెట్ జట్టు ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించించింది. రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. రెండు, మూడో రోజు ఆట వర్షం కారణంగా రద్దు కావడంతో మ్యాచ్ దాదాపు డ్రా అవుతుందని అందరూ భావించారు. కానీ, నాలుగు, 5వ రోజు భారత్ అద్భుతమైన ఆటతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.
మొమినుల్ హక్ చేసిన అజేయ శతకంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ను 230/10 పరుగుల వద్ద ముగించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా ఆడి 285/9 వద్ద డిక్లేర్ చేసింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ రన్ రేట్ 8.22గా ఉండటం విశేషం. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ అర్ధశతకాలు సాధించారు. బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముందు భారత్ 95 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో భారత్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
undefined
కాన్పూర్ టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ తో సరికొత్త రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్ లో 300 వికెట్ల మార్కును అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 3,000 కంటే ఎక్కువ పరుగులు, 300 వికెట్లు సాధించిన 11 మంది ఆటగాళ్ల ప్రత్యేక క్లబ్ లో చేరాడు. ఈ లిస్టులో కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే భారత్ నుంచి ఉన్న ప్లేయర్లు.
ఈ మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ప్లేయర్ గా కూడా జడేజా నిలిచాడు. ఈ రికార్డును అత్యంత వేగంగా అందుకున్న రెండో ప్లేయర్ గా నిలిచాడు. 3 వేలకు పైగా పరుగులు, 300 వికెట్లను వేగంగా సాధించిన ప్లేయర్ల లిస్టులో 72 మ్యాచ్‌లతో ఇయాన్ బోథమ్ టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత 73 టెస్టుల్లో పూర్తి చేసిన జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా తన బౌలింగ్ సగటు కంటే 12.72 పరుగుల బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. ఈ ఘనత సాధించిన 11 మంది ఆటగాళ్లలో రెండవ అత్యధికం. ఈ లిస్టులో ఇమ్రాన్ ఖాన్ 14.88 జడేజా కంటే ముందున్న ఒకేఒక్క ప్లేయర్.
ఎడమచేతి వాటం స్పిన్నర్లలో, జడేజా 362 వికెట్లతో తన కెరీర్‌ను ముగించిన డేనియల్ వెట్టోరి, 433 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న రంగనా హెరాత్‌ల తర్వాత 300 టెస్ట్ వికెట్లు సాధించిన మూడవ ప్లేయర్ గా జడేజా ఉన్నాడు. 1500 పైగా పరుగులు, 150 వికెట్లు సాధించిన 15 మంది ఆటగాళ్లలో జడేజా మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ సగటులలో (16.62) అత్యధిక తేడాను కలిగి ఉన్నాడు. జడేజా బౌలింగ్ సగటు 24.00. ఇక ముత్తయ్య మురళీధరన్ (22.72), అశ్విన్ (23.69) మాత్రమే 200 టెస్ట్ వికెట్లు సాధించిన స్పిన్నర్‌లలో మెరుగైన సగటును కొనసాగించారు. స్వదేశీ టెస్టుల్లో జడేజా సగటు 200-ప్లస్ వికెట్లతో బౌలర్లలో మూడవ అత్యుత్తమంగా సగటు నమోదుచేశాడు. అలాగే, జడేజా టెస్ట్ క్రికెట్‌లో 300 వికెట్ల మార్క్‌ను చేరుకున్న ఏడవ భారతీయ బౌలర్‌గా నిలిచాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత ఆల్ రౌండర్ జడేజా టెస్ట్ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక 300 వికెట్ల క్లబ్‌లో చేరిన తర్వాత భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మాట్లాడుతూ అతనిపై ప్రశంసలు కురిపించాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను కంప్లీట్ ప్యాకేజీగా గా పేర్కొన్నాడు. కాన్పూర్ టెస్టు మ్యాచ్ 4వ రోజు తర్వాత మీడియాతో మాట్లాడిన మోర్కెల్.. జడేజా అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞను, కొన్ని సంవత్సరాలుగా క్రికెట్ పై అతను చూపుతున్న ప్రభావాన్ని ప్రశంసించాడు. "జడేజా ఒక కంప్లీట్ ప్యాకేజీ. మీకు తెలుసా అతను బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, ఫీల్డ్‌లో కూడా మ్యాజిక్ చేయగల ప్లేయర్. మీ జట్టులో మీకు కావలసిన వ్యక్తి ఎప్పుడూ ఉంటాడు. అలాంటి జడేజా కొన్ని సంత్సరాలుగా భారత క్రికెట్ లో తన ప్రభావం ఏంటో చూపించాడని" అన్నారు.
35 ఏళ్ల జడేజా 4వ రోజు బంగ్లాదేశ్‌కు చెందిన హసన్ మహమూద్‌ను అవుట్ చేయడంతో టెస్టు క్రికెట్ లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు సాధించిన ఏడవ భారత క్రికెటర్ గా నిలిచాడు. మోర్నే మోర్కెల్ ఇంకా మాట్లాడుతూ.. ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జడేజా స్పిన్ భాగస్వామ్యాన్ని కూడా హైలైట్ చేశాడు. ప్రత్యర్థి జట్లను కూల్చివేయడంలో వీరిద్దరి పాత్ర మాటల్లో చెప్పలేనిది. అవసరమైన చాలా సందర్భాల్లో వికెట్లతో పాటు బ్యాట్ తో పరుగులు చేయడంలో గొప్ప క్రికెటర్లు. వారి ఆట నైపుణ్యం, జట్టుకోసం కష్టపడే తీరే వారి భాగస్వామ్యం మరింత విజయవంతం కావడానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు.