కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్ ను చిత్తుచేసిన భార‌త్ - సూప‌ర్ విక్ట‌రీతో స‌రికొత్త రికార్డులు

By Mahesh RajamoniFirst Published Oct 1, 2024, 2:19 PM IST
Highlights

IND vs BAN : కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ వేదికగా జ‌రిగిన రెండో టెస్టులో భార‌త్ సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. భార‌త్ 2-0 తో బంగ్లాదేశ్ ను చిత్తుచేసి సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. దీంతో ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ సైకిల్ లో భార‌త్ త‌న అధిప‌త్యాన్ని నిల‌బెట్టుకుంది. 
 

India Test cricket records : బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త్ క్రికెట్ జ‌ట్టు బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. రెండు టెస్టుల సిరీస్ ను ను భార‌త్ 2-0 ఆధిక్యంతో కైవ‌సం చేసుకుంది. కాన్పూర్ లోని గ్రీప్ పార్క్ స్టేడియం వేదిక‌గా భార‌త్-బంగ్లాదేశ్ రెండో టెస్టు మ్యాచ్ జ‌రిగింది. మొద‌టి నుంచి ఈ మ్యాచ్ కు వ‌రుణుడు అడ్డుప‌డుతూనే ఉన్నాడు. తొలి రోజు ఈ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఆల‌స్యంగా ప్రారంభం అయింది. టాస్ గెలిచిన భార‌త్ ముందుగా ఫీల్డింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో బంగ్లాదేశ్ టీమ్ బ్యాటింగ్ కు దిగింది. బంగ్లాదేశ్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 233 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

రెండో రోజు, మూడో రోజు వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ కొన‌సాగ‌లేదు. అయితే, నాల్గ‌వ రోజు, ఐదో రోజు మ్యాచ్ కొన‌సాగింది. నాల్గో రోజు భార‌త్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో టెస్టు క్రికెట్ లో టీ20 క్రికెట్ ఆట‌ను చూపించింది. బౌలింగ్ లోనూ దుమ్మురేపింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను 233 పరుగులకు ఔట్ చేయడంలో మన బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించారు. బుమ్రా 3 వికెట్లు, సిరాజ్ 2, అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నాడు. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. 

Latest Videos

 

భారత్ తొలి ఇన్నింగ్స్ లో ధనాధన్ బ్యాటింగ్ 

 

 

బంగ్లాదేశ్ ఆలౌట్ అయిన త‌ర్వాత భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టింది. ఐసీసీ ప్ర‌పంచ టెస్టు క్రికెట్ ఛాంపియ‌న్ షిప్ ను దృష్టిలో ఉంచుకుని చివ‌రి రోజు మ్యాచ్ ఫ‌లితాన్ని రాబ‌ట్టాల‌ని దూకుడుగా బ్యాటింగ్ చేయ‌డంతో పాటు త్వర‌గానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 285-9 ప‌రుగుల‌కు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భార‌త ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లతో అదరగొట్టారు. జైస్వాల్ 72 పరుగులు, కేఎల్ రాహుల్ 68 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడారు. రోహిత్ శర్మ 23 పరుగులు, గిల్ 39 పరుగులు, కోహ్లీ 47 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడారు. మెహిదీ హసన్ మిరాజ్ 4 వికెట్లు, షకీబ్ అల్ హసన్ 4 వికెట్లు తీసుకున్నారు. 

 

ఐదో రోజు అద‌ర‌గొట్టిన బౌల‌ర్లు - జ‌డేజా, బుమ్రా, అశ్విన్ సూప‌ర్ బౌలింగ్ 

 

ఐదో రోజు భార‌త్ బౌల‌ర్లు అద‌ర‌గొట్టారు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ను 146 ప‌రుగుల‌కే ప‌రిమితం చేశారు. జ‌స్ప్రీత్ బుమ్రా, ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజాలు త‌లా మూడు వికెట్లు తీసుకున్నారు. ఆకాష్ దీప్ కు ఒక వికెట్ ద‌క్కింది. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ల‌లో షాద్మాన్ ఇస్లాం 50 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జాకీర్ హసన్ 10, నజ్ముల్ హుస్సేన్ శాంటో 19,  ముష్ఫికర్ రహీమ్ 37 ప‌రుగులు చేశారు. మిగ‌తా ప్లేయ‌ర్లు సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ భార‌త్ ముందు 95 ప‌రుగుల టార్గెట్ ను ఉంచింది. స్వ‌ల్ప ల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భార‌త జ‌ట్టును య‌శ‌స్వి జైస్వాల్, విరాట్ కోహ్లీలు విజ‌యతీరాల‌కు చేర్చారు. జైస్వాల్ 51 పరుగులు, కోహ్లీ 29*  పరుగులు చేశారు. భార‌త్ మూడు వికెట్లు కోల్పోయి విజ‌యాన్ని అందుకుంది. రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన భార‌త్ రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-0 తో ఆధిక్యంతో కైవ‌సం చేసుకుంది. 

 

కాన్పూర్ టెస్టు లో భారత్ అద్భుతమైన టెస్టు రికార్డులు ఇవే 

 

 

కాన్పూర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో భార‌త్ ప్రపంచ టెస్టు క్రికెట్ లో అద్భుత‌మైన రికార్డులు సాధించింద‌తి. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 ప‌రుగులు చేసిన జ‌ట్టుగా ఘ‌న‌త సాధించింది. రోహిత్ శ‌ర్మ‌, య‌శ‌స్వి జైస్వాల్  ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో భారత్‌ కేవలం మూడు ఓవర్లలోనే 50 పరుగుల మైలురాయిని చేరుకుంది. అలాగే, ఆ త‌ర్వాత భార‌త జట్టు 10.1 ఓవర్లలో 100 ప‌రుగుల మార్కును అందుకుంది. దీని త‌ర్వాత భార‌త్ 18.2 ఓవర్లలో 150 పరుగుల మైలురాయిని చేరుకుంది. 24.2 ఓవర్లలో 200 పరుగులు పూర్తి చేసింది. ఆ త‌ర్వాత టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 250 ప‌రుగులు చేసిన జ‌ట్టుగా భార‌త్ రికార్డు సృష్టించింది.

ఈ మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లి అత్యంత వేగంగా 27,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ 593 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 22 ఏళ్ల ఈ యంగ్ ప్లేయ‌ర్ కేవలం 31 బంతుల్లో (తొలి ఇన్నింగ్స్) 50 పరుగులు సాధించాడు, వీరేంద్ర సెహ్వాగ్ (32 బంతుల్లో) పేరిట ఉన్న గ‌త రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. అయితే, మొత్తంగా ప్లేయ‌ర్ల విష‌యంలో రిషబ్ పంత్ (28), కపిల్ దేవ్ (30) లు భారతదేశం తరపున వేగంగా టెస్ట్ హాఫ్ సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్లుగా జైస్వాల్ కంటే ముందున్నారు.

click me!