ధోనీ కాదు, అతను బాగా ఆడితేనే చెన్నై సూపర్ కింగ్స్‌ గెలుస్తుంది... హర్భజన్ సింగ్ కామెంట్స్...

By Chinthakindhi RamuFirst Published Mar 15, 2023, 3:38 PM IST
Highlights

మహేంద్ర సింగ్ ధోనీకి ఫేర్‌వెల్ సీజన్‌గా ఐపీఎల్ 2023... రూ.16 కోట్లకు రవీంద్ర జడేజాని రిటైన్ చేసుకున్న చెన్నై  సూపర్ కింగ్స్.. 2022 సీజన్ సమయంలో విభేదాలు, మళ్లీ 2023 సీజన్‌లో సీఎస్‌కే తరుపునే ఆడబోతున్న జడ్డూ.. 

ఐపీఎల్ 2020 సీజన్‌లో ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న మొదటి జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఆ తర్వాతి సీజన్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి టైటిల్ గెలిచింది సీఎస్‌కే. 2022 సీజన్‌లో ఏకంగా 9వ స్థానంలో నిలిచింది చెన్నై. ఈసారి కూడా కమ్‌బ్యాక్ ఇచ్చి టైటిల్ గెలవాలని కోరుకుంటున్నారు చెన్నై సూపర్ కింగ్స్...

గత సీజన్‌‌ ఆరంభానికి ముందు రవీంద్ర జడేజాని కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ నిర్ణయం సీఎస్‌కేకి పెద్దగా కలిసి రాలేదు. దీపక్ చాహార్, సామ్ కుర్రాన్ వంటి ప్లేయర్లు, ఐపీఎల్ 2022 సీజన్‌కి దూరంగా ఉండడం, శార్దూల్ ఠాకూర్ వంటి ప్లేయర్లను వేరే టీమ్స్ సొంతం చేసుకోవడం.. సీఎస్‌కే ప్రభావం చూపించాయి...

Latest Videos

అయితే 2023 సీజన్, మహేంద్ర సింగ్ ధోనీకి ఆఖరి ఐపీఎల్. మాహీ ఫేర్‌వెల్ సీజన్‌గా ఐపీఎల్ 2023 సీజన్‌ని ప్రమోట్ చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలిచి, మహేంద్రుడికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని సీఎస్‌కే టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది...

‘చెన్నై సూపర్ కింగ్స్‌, ఈసారి టైటిల్ గెలవాలంటే కీ ప్లేయర్ రవీంద్ర జడేజా. బ్యాటింగ్ ఆర్డర్‌లో జడేజాని ప్రమోట్ చేయాలి. అలాగే అతను వేసే 4 ఓవర్లు, చెన్నై సూపర్ కింగ్స్‌కి చాలా కీలకం. నా దృష్టిలో వరల్డ్‌లో రవీంద్ర జడేజా కంటే బెటర్ ఆల్‌రౌండర్ లేడు.. 

ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా ఎలా ఆడతాడో సీఎస్‌కే పర్ఫామెన్స్‌ని డిసైడ్ చేస్తుంది. 2021 సీజన్‌లో జడేజా ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించాడు, సీఎస్‌కే టైటిల్ గెలిచింది. 2022 సీజన్‌లో జడ్డూ ఫెయిల్ అయ్యాడు, చెన్నై పొజిషన్ ఏంటో అందరికీ తెలిసిందే..

అందుకే చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎక్స్ ఫ్యాక్టర్ అంటూ ఉంటే అది రవీంద్ర జడేజానే. అతను ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. సీఎస్‌కేకి చెన్నైలో ఉండే సపోర్ట్ వేరే లెవెల్. అందుకే అక్కడ మ్యాచులు ఆడాలంటే ఏ టీమ్ అయినా కాస్త ఒత్తిడికి గురవుతారు...

బెన్ స్టోక్స్, మొయిన్ ఆలీ కచ్ఛితంగా టీమ్‌లో ఉండాల్సిందే. ఇక డివాన్ కాన్వే బ్యాటింగ్, తీక్షణ బౌలింగ్‌ చాలా కీ రోల్ పోషించబోతున్నాయి. ముంబైలాంటి వేరే చోట్లలో మ్యాచులు ఆడేటప్పుడు తీక్షణ కంటే పతిరానాని ఆడిస్తే బాగుంటుంది... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

ఐపీఎల్ 2022 సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్, జడ్డూని బలవంతంగా సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పించిందని వార్తలు వచ్చాయి. సీజన్ మధ్యలో గాయపడి, టోర్నీ నుంచి తప్పుకున్న జడేజా... చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌కి సంబంధించిన ఫోటోలు, పోస్టులన్నీ డిలీట్ చేశాడు...

అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా రవీంద్ర జడేజాని అన్‌ఫాలో చేసింది. అయితే ఎట్టకేలకు ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు జడేజాతో జరిపిన సంప్రదింపులు విజయవంతం కావడంతో అతను చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడేందుకు అంగీకరించాడు.. 

click me!