డ్యాన్స్ అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. అనుష్క రియాక్షన్ ఇదే..!

Published : Mar 15, 2023, 10:32 AM IST
 డ్యాన్స్ అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. అనుష్క రియాక్షన్ ఇదే..!

సారాంశం

కోహ్లీ చేతిలో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఎలా ఆడాలో వారికి చూపిస్తూ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియోకి ఇప్పటి వరకు 7.3 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... మైదానంలోకి అడుగుపెడితే చాలు పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. అందుకు ఆయనను రన్ మెషిన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. మైదానంలో బ్యాట్ పట్టి చెలరేగడంతో పాటు... అప్పుడప్పుడు స్టెప్పులు వేయడం కూడా కోహ్లీకి అలవాటే. ఇప్పటి వరకు చాలా సార్లు కోహ్లీ డ్యాన్స్ వేసిన వీడియోలు మీరు చూసే ఉంటారు. కాగా.... తాజాగా ఆయన మరోసారి డ్యాన్స్ చేశారు. నార్వేయన్ గ్రూప్ తో కలిసి ఆయన స్టెప్పులు వేశారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ కోసం ముంబై వెళ్లిన విరాట్.. అక్కడ నార్వేకు చెందిన డ్యాన్స్ గ్రూప్ క్విక్ స్టైల్ తో కలిసి స్టెప్పులేశాడు. ఈ వీడియోని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

కోహ్లీ చేతిలో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఎలా ఆడాలో వారికి చూపిస్తూ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియోకి ఇప్పటి వరకు 7.3 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. కాగా... ఈ వీడియోకి ఆయన భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ స్పందించారు.  ఫైర్ ఎమోజీలను ఆమె కామెంట్ లో పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?