IPL 2024 KKR vs CSK : హ్యాట్రిక్ విజయాలతో ముందుకు సాగుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ కు చెన్నై సూపర్ కింగ్ కు షాకిచ్చింది. ఆల్ రౌండ్ షోతో కేకేఆర్ ను చిత్తుగా ఓడించింది చెన్నై.
KKR vs CSK Highlights : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 22వ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో జోరుమీదున్న కేకేఆర్ కు షాకిచ్చింది చెన్నై. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి మరో విజయాన్ని అందుకుంది ఎంఎస్ ధోని టీమ్. చెపాక్ లో జరిగిన ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా బంతితో మ్యాజిక్ చేశాడు. అలాగే, తుషార్ దేశ్ పాండే అద్భుతమైన బౌలింగ్ లో కేకేఆర్ ను దెబ్బతీశాడు. జడేజా,దేశ్ పాండేలు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
చెన్నైలో జరిగిన 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో తొలి ఓటమిని చవిచూసింది. 17.4 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ సూపర్ కింగ్స్ తరపున అద్భుతమైన ఆటతో ఈ మ్యాచ్ లో సూపర్ స్టార్లుగా నిలిచారు.
IPL 2024 : ట్రిస్టన్ స్టబ్స్ దేబ్బకు స్టన్నయ్యారు.. ఎవడ్రా వీడు ఇలా కొట్టేశాడు.. !
మ్యాచ్ ప్రారంభం నుంచే కేకేఆర్ కు కష్టాలు మొదలయ్యాయి. ఆట మొదటి బంతికే ఫిలిప్ సాల్ట్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత సునీల్ నరైన్ (27), అంగ్క్రిష్ రఘువంశీ (24) ఇన్నింగ్స్ లతో పవర్ ప్లే లో 56 పరుగులు అందించారు. ఆ తర్ఆవత కొద్ది సేపటికే చెన్నై బౌలర్లు విజృంచాడు. నరైన్ ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు. అదే ఓవర్ లో రఘువంశీని కూడా ఔట్ చేశాడు. ముస్తాఫిజూర్ రెహ్మాన్ బౌలింగ్ లో శ్రేయాస్ అయ్యర్ 34 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ దాదాపు ముగిసింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయకుండానే వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో కోల్ కతా టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.
ఈజీ టార్గెట్ ను సులభంగా ఛేదించింది చెన్నై
ఈజీ టార్గెట్ ను ఛేదించే సమయంలో సీఎస్కే పెద్దగా ఇబ్బంది పడలేదు. రచిన్ రవీంద్ర (15), గైక్వాడ్ (67) 27 పరుగులు జోడించారు. చెన్నై కెప్టెన్ గైక్వాడ్, డారిల్ మిచెల్ (25) తో కలిసి 70 పరుగుల భాగస్వామ్యంతో చెన్నైని గెలుపు ముంగిటకు చేర్చారు. మిచెల్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (28) ధనాధన్ ఇన్నింగ్స్ తో చెన్నైకి విజయాన్ని అందించాడు.
జడేజా, తుషార్ పాండేలు అదరగొట్టారు..
ఈ మ్యాచ్ లో జడేజా, తుషార్ దేశ్ పాండేలు కేకేఆర్ ను తమ బౌలింగ్ తో చెడుగుడు ఆడుకున్నారు. జడ్డూ భాయ్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి కోల్ కతాకు షాక్ ఇచ్చాడు. మొత్తంగా 4 ఓవర్ల తన బౌలింగ్ తో 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో కేకేఆర్ పై 22 వికెట్లు సాధించాడు. అలాగే, తుషార్ దేశ్ పాండే సైతం కేకేఆర్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. దేశ్‌పాండే నాలుగు ఓవర్లలో 3 వికెట్లు తీసుకున్నాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 2 వికెట్లు సాధించాడు. దీంతో ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు. 4 మ్యాచ్ లలో 14.22 సగటుతో 9 వికెట్లు పడగొట్టాడు.
రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ..
రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. గైక్వాడ్ 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చెన్నై కెప్టెన్ గా అతనికి ఇది తొలి హాఫ్ సెంచరీ. మొత్తంగా ఐపీఎల్ కెరీర్ లో గైక్వాడ్ కు 15వ ఐపీఎల్ అర్ధశతకం కాగా, స్టార్ బ్యాటర్ నైట్ రైడర్స్‌పై తన మూడవ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. అలాగే, కేకేఆర్ పై 300 పరుగులు పూర్తిచేశాడు.
KKR VS CSK : కేకేఆర్ ను గడగడలాడించిన జడ్ఢూభాయ్, తుషార్ దేశ్ పాండే..