IPL 2024 : ట్రిస్ట‌న్ స్టబ్స్ దేబ్బ‌కు స్ట‌న్న‌య్యారు.. ఎవ‌డ్రా వీడు ఇలా కొట్టేశాడు.. !

By Mahesh Rajamoni  |  First Published Apr 8, 2024, 10:17 PM IST

IPL 2024 Tristan Stubbs : వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఐపీఎల్ 2024ను ప్రారంభించిన ముంబై ఇండియ‌న్స్ కు ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్ లో ఎట్ట‌కేల‌కు విజ‌యంతో ఊపిరిపీల్చుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో అదిరిపోయే ఇన్నింగ్స్ తో  కొద్ది స‌మ‌యం పాటు ముంబైని వ‌ణించాడు ట్రిస్ట‌న్ స్ట‌బ్స్.


IPL 2024 Tristan Stubbs : వాంఖడే స్టేడియంలో 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) లో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజ‌యంతో ముంబై ఇండియన్స్ ఈ సీజ‌న్ లో తొలి విజ‌యాన్ని అందుకుంది. అయితే, అద్భుతైన ఇన్నింగ్స్ ఆడిన ట్రిస్ట‌ర్ స్ట‌బ్స్ ఆట‌తో కూడా ఢిల్లీ గెల‌వ‌క‌పోవ‌డంతో ఓడిపోవడంతో త‌న కెరీర్‌లో అత్యుత్తమ నాక్ ఫలించలేదు . 235 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ, త‌న ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లో ముంయిచ చెమ‌ట‌లు ప‌ట్ట‌లించాడు  స్ట‌బ్స్. కేవ‌లం 25 బంతుల్లో 71* పరుగులు కొట్టాడు ట్రిస్ట‌న్ స్ట‌బ్స్. దీంతో ఐపీఎల్ లో ఢిల్లీ త‌ర‌ఫున మూడవ వేగవంతమైన అర్ధ సెంచరీని సాధించాడు.

డీసీ రన్-ఛేజ్ ప్రారంభంలోనే డేవిడ్ వార్నర్‌ను వికెట‌న్ ను కోల్పోయింది, అయితే, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ క‌లిసి జ‌ట్టు స్కోర్ ను 100 దాటించారు. వీరిద్దరూ మూడు ఓవర్ల వ్య‌వ‌ధిలోపే నిష్క్రమించినప్పటికీ, ఛేజింగ్‌లో ట్రిస్ట‌న్ స్టబ్స్ ఢిల్లీని సజీవంగా ఉంచాడు. ముంబై బౌల‌ర్ల‌ల‌పై ఎదురుదాడికి దిగిన స్ట‌బ్స్ క‌ళ్లు చెదిరే షాట్స్ తో బ్యాట్ తో అద‌ర‌గొట్టాడు. కేవ‌లం 25 బంతుల్లో 71* పరుగులు త‌న ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. స్టబ్స్ కేవలం 19 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసి, ఐపీఎల్ లో డీసీ త‌ర‌ఫున అత్యంత వేగవంత‌మైన మూడో హాఫ్ సెంచ‌రీని కొట్టాడు. అంత‌కుముందు రిష‌బ్ పంత్, ఫృథ్వీ షాలు ఇద్ద‌రూ 18 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ఈ లిస్టులో క్రిస్ మోరిస్ టాప్ లో ఉన్నాడు.

Latest Videos

అద్భుత బౌలింగ్ తో ఒంటిచెత్తో క‌ళ్లుచెదిరే క్యాచ్ ప‌ట్టిన ర‌వి బిష్ణోయ్.. వీడియో

కాగా, ఐపీఎల్‌లో స్టబ్స్‌కి ఇది రెండో అర్ధ సెంచరీ. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడిన ఇంత‌కుముందు మ్యాచ్ లో ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ త‌న తొలి హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ క‌లిగిన దక్షిణాఫ్రికా యంగ్ ప్లేయ‌ర్ స్టబ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ బేస్ ధర రూ. 50 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది. అతను అంతకుముందు టోర్నమెంట్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు ఆడాడు. స్టబ్స్ ఇప్పుడు తొమ్మిది ఐపీఎల్ మ్యాచ్ ల‌లో 160.80 స్ట్రైక్ రేట్‌తో 201 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ కి ఫృథ్వి షా శుభారంభం అందించ‌గా, వార్న‌ర్ మాత్రం త్వ‌ర‌గానే ఔట్ అయ్యాడు. అయితే, అభిషేక్ పోరెల్  41 ప‌రుగుల ఇన్నింగ్స్ తో ఢిసీకి 100 ప‌రుగులు మార్కును దాటించాడు. పృథ్వి షా దుమ్మురేపుతూ హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. అయితే, అద్భుత‌మైన యార్క‌ర్ తో షాను 66 ప‌రుగుల వ‌ద్ద బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో పోరెల్ (41), రిషబ్ పంత్ (1) ఔట్ కావ‌డంతో ఢిల్లీకి దెబ్బ‌త‌గిలింది. 29 ప‌రుగుల గేడాతో ఓడిపోయింది.

 

Tristan Stubbs: Powerpic.twitter.com/59MZ9JtDMN

— Random Cricket Stats (@randomcricstat)

భారత్ చూసిన అత్యుత్తమ కెప్టెన్.. ధోనిపై అప్పుడు విమ‌ర్శలు.. ఇప్పుడు గౌతమ్ గంభీర్ కామెంట్స్ వైరల్ ! 

click me!