Ravi Bishnoi Super Catch : ఐపీఎల్ 2024 21వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఎకానా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్‌ను అవుట్ చేయడానికి రవి బిష్ణోయ్ కళ్లుచెదిరే క్యాచ్ పట్టాడు.
GT vs LSG Ravi Bishnoi : ఐపీఎల్ 2024 21వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో గుజరాత్‌కు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ బ్యాటింగ్ సమయంలో లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన బౌలింగ్ లో అద్భుమైన కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్ కు పంపడానికి ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ ను పట్టుకున్నాడు.
ఈ కళ్లు చెదిరే ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టడంతో గ్రౌండ్ లోని బ్యాటర్, ఇతర ఆటగాళ్లతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రవి బిష్ణోయ్ పట్టుకున్న అద్భుతమైన క్యాచ్ దృశ్యాలను పంచుకుంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ రెండో బంతికే విలియమ్సన్‌ను అద్భుతంగా ఔట్ చేశాడు.
వాంఖడేలో అదరగొట్టిన హిట్‌మ్యాన్.. కోహ్లీ, వార్నర్ క్లబ్ లో రోహిత్ శర్మ !
𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 😲
Flying Bishoni ✈️
Ravi Bishnoi pulls off a stunning one-handed screamer to dismiss Kane Williamson 👏👏
Watch the match LIVE on and 💻📱 | pic.twitter.com/Le5qvauKbf
యశ్ ఠాకూర్ దెబ్బకు గుజరాత్ ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పతనాన్ని యశ్ ఠాకూర్ శాసించాడు. అద్భుతమైన బౌలింగ్ తో 5 వికెట్లు తీసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో మార్కస్ స్టోయినిస్ (58 పరుగులు), నికోలస్ పూరన్ (32 నాటౌట్), కేఎల్ రాహుల్ (33 పరుగులు)ల ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. జవాబుగా లక్నో బ్యాట్స్‌మెన్ కేవలం 130 పరుగులకే ఆలౌటయ్యారు.
B.E.A.U.T.Y 😍
Yash Thakur breaches Shubman Gill's defence with a superb delivery👌👌 54/1 in 6 overs
Watch the match LIVE on and 💻📱 | pic.twitter.com/qY8lwrHR4R
GT VS LSG HIGHLIGHTS : యష్ ఠాకూర్ విశ్వరూపం.. తోకముడిచిన గుజరాత్..