GT vs LSG Highlights : లక్నో సూపర్ జెయింట్స్ తమ సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించి సీజన్‌లో మూడవ విజయాన్ని అందుకుంది. లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ అద్భుతమైన బౌలింగ్ తో గుజరాత్ పతనాన్ని శాసించాడు.
GT vs LSG - Yash Thakur : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ లో 21వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన లక్నో టీమ్ మరో విజయాన్ని అందుకుంది. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్ ను చిత్తుచేసింది. లక్నోకు 4 మ్యాచ్‌ల్లో ఇది మూడో విజయం కాగా, గుజరాత్‌కు 5 మ్యాచ్‌ల్లో మూడో ఓటమి.
ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో మార్కస్ స్టోయినిస్ హాఫ్ సెంచరీ, నికోలస్ పూరన్-కెఎల్ రాహుల్ లు మంచి ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. దీంతో 164 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ కేవలం 130 పరుగులకే ఆలౌట్ అయింది. యశ్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. 5 వికెట్లు తీసుకున్నాడు.
భయ్యా హాఫ్ సెంచరీ అయినా కొట్టనివ్వచ్చు కదా.. !
Three in a row! 💙 pic.twitter.com/anH2X0r7Uo
— Lucknow Super Giants (@LucknowIPL)యశ్ ఠాకూర్ బౌలింగ్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు కేవలం 130 పరుగులకే పరిమితమైంది. శుభ్‌మన్ గిల్ (19 పరుగులు), విజయ్ శంకర్ (17 పరుగులు), రాహుల్ తెవాటియా (30 పరుగులు), రషీద్ ఖాన్ (0 పరుగులు), నూర్ అహ్మద్ (4 పరుగులు)లను ల వికెట్లను తీసుకున్నాడు యశ్ ఠాకూర్.
యశ్ ఠాకూర్ తన 3.5 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, కృనాల్ పాండ్యా తన 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సాయి సుదర్శన్ (31 పరుగులు), శరత్ (2 పరుగులు), దర్శన్ నల్కండే (12 పరుగులు)లను కృనాల్ పాండ్యా పెవిలియన్ కు పంపాడు.
Garda ukhad diya 🥶pic.twitter.com/RQzDliOuar
— Lucknow Super Giants (@LucknowIPL)హాఫ్ సెంచరీతో మెరిసిన మార్కస్ స్టోయినిస్
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ హాఫ్ సెంచరీతో రాణించాడు. స్టోయినిస్ 43 బంతుల్లో 58 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అలాగే, నికోలస్ పూరాన్, కేఎల్ రాహుల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు. రాహుల్ 33 పరుగులు, పూరాన్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆయుష్ బదోని 11 బంతుల్లో 20 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. డి కాక్ (6 పరుగులు), దేవదత్ పడిక్కల్ (7 పరుగులు) లు మరోసారి నిరాశపరిచాడు.
Ready to fight 💪 pic.twitter.com/qX7fQm75Sa
— Lucknow Super Giants (@LucknowIPL)లక్నోకు మూడో విజయం
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్‌కు ఇది మూడో విజయం. ఈ విజయంతో లక్నో 4 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. 4 మ్యాచ్‌లు ఆడి అన్నింటినీ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ నంబర్ వన్ స్థానంలో ఉంది. రెండో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఉంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 5 మ్యాచ్‌ల్లో 3 ఓటములతో 7వ స్థానంలో ఉంది.
వాంఖడేలో అదరగొట్టిన హిట్‌మ్యాన్.. కోహ్లీ, వార్నర్ క్లబ్ లో రోహిత్ శర్మ !