IPL 2024 : MI vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2024 20వ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాట్ తో దుమ్మురేపాడు. అర్ధ సెంచరీ ఒక పరుగు దూరంలో ఔట్ అయినప్పటికీ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు.
Rohit Sharma's records : ఐపీఎల్ 2024లో సూపర్ ఇన్నింగ్స్ తో మెరిశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ధనాధన్ బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ తన అర్ధ సెంచరీని 1 పరుగుతో పూర్తి చేయలేకపోయాడు కానీ, తన ఇన్నింగ్స్ తో మరో ఘనత సాధించాడు. కింగ్ విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్‌ల ప్రత్యేక క్లబ్‌లో చోటు సంపాదించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.
కోహ్లీ-వార్నర్‌ల క్లబ్‌లోకి రోహిత్ శర్మ..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 49 పరుగులతో ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్‌లో రెండు జట్లపై 1000+ పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ తర్వాత మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై వార్నర్ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. అదే సమయంలో, రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 1000+ పరుగులు కొట్టాడు.
ఐపీఎల్ లో ఎక్కువ జట్లపై 1000+ పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
డేవిడ్ వార్నర్ vs పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్
విరాట్ కోహ్లీ vs ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్
రోహిత్ శర్మ vs కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్
టీ20లో రోహిత్ శర్మ బౌండరీల రికార్డు..
టీ20 ఫార్మాట్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో 1500+ బౌండరీలు సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్ రోహిత్. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ ఇప్పటివరకు 1508 బౌండరీలు బాదాడు. ఈ రికార్డుల లిస్టులో 1486 బౌండరీలతో విరాట్ కోహ్లీ రెండో ప్లేస్ లో ఉన్నాడు. శిఖర్ ధావన్ 1337 బౌండరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. భారత మాజీ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా 1103తో నాలుగో స్థానంలో ఉన్నాడు.