Ranji Trophy 2024: ఆంధ్ర టీమ్ ఘోర ఓట‌మి.. 10 వికెట్ల తేడాతో ముంబై గెలుపు

By Mahesh RajamoniFirst Published Jan 16, 2024, 2:09 PM IST
Highlights

Ranji Trophy 2024: ఎంసీఏ-బీకేసీ మైదానంలో జ‌రిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో ఆంధ్రా జ‌ట్టు ఓట‌మిపాలైంది. ఆంధ్ర‌పై విజ‌యంతో ముంబై రంజీ ట్రోఫీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో లెఫ్టార్మ్ స్పిన్నర్ షామ్స్ ములాని 10 వికెట్లతో రాణించాడు.
 

Mumbai beats Andhra by 10 wickets: రంజీ ట్రోఫీ రెండో రౌండ్ ఆంధ్రప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై బౌలర్ షామ్స్ ములానీ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ముంబై జట్టు ప్రస్తుతం ఎలైట్ గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉంది. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీలో జరిగిన ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 395 పరుగులు చేసింది. భూపేన్ లావానీ (61), తనూష్ కొటియాన్ (54), మోహిత్ అవస్థి (53) హాఫ్ సెంచరీలు సాధించారు. వీరితో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా 48 పరుగులతో రాణించాడు.

జ‌ట్టులో చోటు దక్కకపోవ‌డంపై మౌనం వీడిన శిఖర్ ధావన్.. గ‌బ్బ‌ర్ కామెంట్స్ వైర‌ల్ !

Latest Videos

ఆంధ్రా బౌలర్లలో నితీష్ రెడ్డి ఐదు వికెట్లు పడగొట్టాడు. ధావల్ కులకర్ణి, షామ్స్ ములానీ నిప్పులు చెరిగే బౌలింగ్ తో  ఆంధ్రా టీమ్ ను తొలి ఇన్నింగ్స్ లో 184 పరుగులకే క‌ట్ట‌డి చేసింది ముంబై.  రెండో ఇన్నింగ్స్ లో హ‌నుమ విహారీ, ఎస్కే ర‌షీద్ లు సెంచ‌రీలు సాధించ‌డంతో ఆంధ్ర టీమ్ 244 ప‌రుగ‌లకు ఆలౌట్ అయింది. ముంబై టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 395 ప‌రుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 34 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 8.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ఈ మ్యాచ్ లో 10 వికెట్లు తీసుకుని బౌలింగ్ తో అద‌ర‌గొట్టిన షామ్స్ ములానీ ప్లేయ‌ర్ ఆఫ ది మ్యాచ్ గా నిలాచాడు.
ప్రపంచంలోనే తొలి క్రికెట‌ర్ గా విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు

click me!