ఏ బిడ్డా ఇది నా అడ్డా! రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీల మోత... డాన్ బ్రాడ్‌మన్ తర్వాత...

Published : Jun 07, 2022, 01:01 PM IST
ఏ బిడ్డా ఇది నా అడ్డా! రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీల మోత... డాన్ బ్రాడ్‌మన్ తర్వాత...

సారాంశం

Ranji Trophy 2022: ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్...  సీజన్‌లో మూడో సెంచరీ... 

టీమిండియా సెలక్టర్లు పట్టించుకోకపోయినా, ఐపీఎల్‌లో పెద్దగా అవకాశాలు రాకపోయినా రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్... సెంచరీల మోత మోగిస్తూనే ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రంజీ ట్రోఫీలో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న సర్ఫరాజ్ ఖాన్... ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మరో శతకం నమోదు చేశాడు...

205 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 153 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ సువెద్ పార్కర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 267 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి.. మయాంక్ మిశ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సీజన్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కి ఇది మూడో సెంచరీ కాగా, ఇప్పటికే 2022 సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు...

ఓవరాల్‌గా ఏడో ఫస్ట్ క్లాస్ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్, ఏడోసారి 150+ నమోదు చేశాడు. ఇందులో రెండు త్రిబుల్ సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు సర్ఫరాజ్ ఖాన్. గత 13 ఇన్నింగ్స్‌ల్లో 162.4 సగటుతో 1624 పరుగులు చేశాడు సర్ఫరాజ్ ఖాన్, ఇందులో 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు, ఆరు సార్లు 150+ స్కోర్లు, మూడు డబుల్ సెంచరీలు, ఓ త్రిబుల్ సెంచరీ ఉన్నాయి...

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 77.7 సగటుతో 2099 పరుగులు నమోదు చేసిన సర్ఫరాజ్ ఖాన్, ది గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అత్యధిక సగటుతో 2 వేలకు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. డాన్ బ్రాడ్‌మెన్ సగటు 95.14 కాగా విజయ్ మర్చంట్ 71.64, జార్జ్ హెడ్లీ 69.86, బహీర్ షా 69.02 సగటుతో మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు...

సర్ఫరాజ్ ఖాన్ సెంచరీకి తోడు సువెద్ పార్కర్ కూడా సెంచరీతో చెలరేగడంతో 122 ఓవర్లుమ ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 452 పరుగులు చేసిన ముంబై జట్టు, భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. పృథ్వీ షా 21 పరుగులు, యశస్వి జైస్వాల్ 35 పరుగులు చేసి అవుట్ కాగా అర్మాన్ జాఫర్ 60 పరుగులు చేశాడు..  

సీనియర్ వికెట్ కీపర్ ఆదిత్య తారే 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. అభిషేక్ రమన్ 60, అభిమన్యు ఈశ్వరన్ 65 పరుగులు, సుదీప్ కుమార్ గరామీ 157, అనుస్త్ప్ ముజుంబర్ 117 పరుగులు చేయడంతో 125 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 415 పరుగులు చేసింది బెంగాల్...

ఉత్తరప్రదేశ్, కర్ణాటక మధ్య జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక 253 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సమర్త్ 57 పరుగులు చేయగా మయాంక్ అగర్వాల్ 10, కరణ్ నాయర్ 29, మనీశ్ పాండే 27 పరుగులు చేశారు. 

పంజాబ్, మధ్య ప్రదేశ్ మధ్య జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్‌లో పంజాబ్ జట్టు 219 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అభిషేక్ శర్మ 47, అన్‌మోల్‌ప్రీత్ సింగ్ 47, సన్వీర్ సింగ్ 41 పరుగులు చేశారు. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !
IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ