న్యూజిలాండ్ కు భారీ షాక్.. గాయంతో ఇంగ్లాండ్ సిరీస్ కు కీలక ఆల్ రౌండర్ దూరం

Published : Jun 07, 2022, 11:02 AM ISTUpdated : Jun 07, 2022, 11:03 AM IST
న్యూజిలాండ్ కు భారీ షాక్.. గాయంతో ఇంగ్లాండ్ సిరీస్ కు కీలక ఆల్ రౌండర్ దూరం

సారాంశం

Eng vs NZ: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆల్ రౌండర్ గా ఉన్న కొలిన్ డి గ్రాండ్ హోమ్ గాయం కారణంగా తుది జట్టు నుంచి తప్పుకున్నాడు.    

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ఇటీవలే ముగిసిన తొలి టెస్టు లో ఓడి సిరీస్ లో వెనుకబడి ఉంది. ఇక తాజాగా ఆ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్ కీలక ఆల్ రౌండర్ గా ఉన్న  కొలిన్ డి గ్రాండ్ హోమ్  కు గాయమైంది. కుడి కాలు మడమ దగ్గర గాయం కావడంతో  అతడికి 10 నుంచి 12 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో అతడు ఇంగ్లాండ్ పర్యటన  నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు. గ్రాండ్ హోమ్ కు గాయమైన విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించాడు. 

గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. ‘అవును.. గ్రాండ్ హోమ్ కు గాయమైంది. అతడు ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మా టెస్టు జట్టులో అతడు కీలక సభ్యుడు. గ్రాండ్ హోమ్ ను మిస్ అవడం మాకు పెద్ద షాక్ వంటిది. అతడి స్థానంలో మిచెల్ బ్రాస్వెల్ ను జట్టులోకి తీసుకుంటున్నాం..’ అని  తెలిపాడు. 

లార్డ్స్ టెస్టులో గ్రాండ్ హోమ్ న్యూజిలాండ్ ను ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో తన సహచర ఆటగాళ్లంతా అలా వచ్చి ఇలా వెళ్తుంటే అతడొక్కడే పోరాడాడు. తొలి ఇన్నింగ్స్ లో 50 బంతులాడి.. 42 పరుగులు చేశాడు.  ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో  కివీస్ టాప్ స్కోరర్ అతడే. గ్రాండ్ హోమ్ రాణించడంతో  కివీస్.. 132 పరుగులు చేయగలిగింది. అతడు కూడా చేతులెత్తేస్తే వంద పరుగుల లోపే ఆలౌట్ అయ్యేది. 

 

బ్యాట్ తో రాణించిన అతడు బాల్ తో కూడా మెరిశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఓ వికెట్ తీశాడు. జో రూట్ వికెట్  అతడికే దక్కింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా  పొదుపుగా బౌలింగ్ చేశాడు. కాగా లార్డ్స్ టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓడిన కివీస్.. ఈ ననెల 14 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ప్రారంభం కాబోయే రెండో టెస్టులో ఇంగ్లాండ్ తో తాడో పేడో తేల్చుకోనున్నది. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?