ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ... వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన బీహార్ బ్యాటర్...

Published : Feb 18, 2022, 04:41 PM ISTUpdated : Feb 18, 2022, 04:52 PM IST
ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ... వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన బీహార్ బ్యాటర్...

సారాంశం

ఫస్ట్ క్లాస్ ఆరంగ్రేట మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా షకీబుల్ గనీ వరల్డ్ రికార్డు... డబుల్ సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్... 

రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో 22 ఏళ్ల బీహార్ ఆటగాడు షకీబుల్ గనీ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. మిజోరంతో జరుగుతున్న మ్యాచ్‌లో మొట్టమొదటి రంజీ మ్యాచ్ ఆడుతున్న షకీబుల్ గనీ 405 బంతుల్లో 56 ఫోర్లు, 2 సిక్సర్లతో 341 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే ఆరంగ్రేటం మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు షకీబుల్ గనీ... 

ఇంతకుముందు 2018-19 సీజన్‌లో ఆరంగ్రేటం చేసిన అజయ్ రోహరా తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 267 పరుగులు చేశాడు. ఇప్పటిదాకా ఇదే ఫస్ట్ క్లాస్ ఆరంగ్రేట మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు... షకీబుల్ గనీతో పాటు బబుల్ ఖాన్ 398 బంతుల్లో 27 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 229 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

బిపిన్ సౌరబ్ 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో 159.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 686 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది బీహార్... 

పేలవ ఫామ్‌తో టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కోల్పోయిన అజింకా రహానే, రంజీ ట్రోఫీలో సెంచరీతో చెలరేగాడు. రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై, 119 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది...

కెప్టెన్ పృథ్వీషా 10 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ కాగా, అకార్ష్‌త్ గోమ్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సచిన్ యాదవ్ 25 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

అజింకా రహానే 290 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 129 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. యంగ్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ 401 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 275 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

సర్ఫరాజ్ ఖాన్‌కి గత 9 ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగో సెంచరీ కాగా, మూడో డబుల్ సెంచరీ. గత 9 రంజీ ట్రోఫీల్లో 199.16 సగటుతో 1195 పరుగులు చేశాడు సర్ఫరాజ్ ఖాన్.  అజింకా రహానే, సర్ఫారాజ్ ఖాన్ సెంచరీల కారణంగా 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసి డిక్లేర్ చేసింది ముంబై జట్టు. 

రైల్వేస్, కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత సీనియర్ క్రికెటర్ మనీశ్ పాండే సెంచరీ చేశాడు. మయాంక్ అగర్వాల్ 38 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి రనౌట్ కాగా దేవ్‌దత్ పడిక్కల్ 56 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

సామర్థ్ 79 బంతుల్లో 8 ఫోర్లతో 47 పరుగులు చేయగా సిద్ధార్థ్ 250 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 146 పరుగులు చేశాడు...కర్ణాటక కెప్టెన్ మనీశ్ పాండే 121 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 156 పరుగులు చేసి అదరగొట్టాడు. కృష్ణప్ప గౌతమ్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు...

రైల్వేస్ యంగ్ బౌలర్ యువరాజ్ సింగ్ 5 వికెట్లు తీసి ఆకట్టుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 481 పరుగులకి ఆలౌట్ అయ్యింది కర్ణాటక... ఢిల్లీ తరుపున మొట్టమొదటి రంజీ మ్యాచ్ ఆడుతున్న అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ 150 బంతుల్లో 18 ఫోర్లతో 113 పరుగులు చేశాడు. యశ్ ధుల్‌కి ఇదే మొట్టమొదటి రంజీ మ్యాచ్ కావడం విశేషం...

లలిత్ యాదవ్ 287 బంతుల్లో 17 ఫోర్లు, 10 సిక్సర్లతో 177 పరుగులు చేయగా జాంటీ సిద్ధు 71 పరుగులు చేయడంతో తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 452 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

బెంగాల్, బరోడా మధ్య జరుగుతున్న మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు 181 పరుగులకి ఆలౌట్ అయ్యింది.కెప్టెన్ కేదార్ దేవ్‌ధర్ 31 పరుగులు చేయగా మతేశ్ పటేల్ 66 పరుగులు చేశాడు. ఆ తర్వాత బెంగాల్ 88 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అతిత్ సేత్ 5 వికెట్లు తీయగా లుక్మన్ మెరివాలా 3 వికెట్లు తీశాడు.  

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు