
పేలవ ఫామ్‌తో టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కోల్పోయిన అజింకా రహానే, రంజీ ట్రోఫీలో సెంచరీతో చెలరేగాడు. రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై, 119 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది...
కెప్టెన్ పృథ్వీషా 10 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ కాగా, అకార్ష్‌త్ గోమ్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సచిన్ యాదవ్ 25 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
అజింకా రహానే 290 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 129 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. యంగ్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ 304 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 151 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
మెల్‌బోర్న్ టెస్టు తర్వాత గత ఏడాది కాలంగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన అజింకా రహానే, ఈ పర్ఫామెన్స్ కారణంగా శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయిన మరో సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరుపున బరిలో దిగుతున్నాడు.
రైల్వేస్, కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత సీనియర్ క్రికెటర్ మనీశ్ పాండే సెంచరీ చేశాడు. మయాంక్ అగర్వాల్ 38 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి రనౌట్ కాగా దేవ్‌దత్ పడిక్కల్ 56 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
సామర్థ్ 79 బంతుల్లో 8 ఫోర్లతో 47 పరుగులు చేయగా సిద్ధార్థ్ 250 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 146 పరుగులు చేశాడు... కర్ణాటక కెప్టెన్ మనీశ్ పాండే 121 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 156 పరుగులు చేసి అదరగొట్టాడు. కృష్ణప్ప గౌతమ్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు...
రైల్వేస్ యంగ్ బౌలర్ యువరాజ్ సింగ్ 5 వికెట్లు తీసి ఆకట్టుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 481 పరుగులకి ఆలౌట్ అయ్యింది కర్ణాటక... ఢిల్లీ తరుపున మొట్టమొదటి రంజీ మ్యాచ్ ఆడుతున్న అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ 150 బంతుల్లో 18 ఫోర్లతో 113 పరుగులు చేశాడు. యశ్ ధుల్‌కి ఇదే మొట్టమొదటి రంజీ మ్యాచ్ కావడం విశేషం...
లలిత్ యాదవ్ 287 బంతుల్లో 17 ఫోర్లు, 10 సిక్సర్లతో 177 పరుగులు చేయగా జాంటీ సిద్ధు 71 పరుగులు చేయడంతో తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 452 పరుగులకి ఆలౌట్ అయ్యింది...
బెంగాల్, బరోడా మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు 181 పరుగులకి ఆలౌట్ అయ్యింది.కెప్టెన్ కేదార్ దేవ్‌ధర్ 31 పరుగులు చేయగా మతేశ్ పటేల్ 66 పరుగులు చేశాడు. ఆ తర్వాత బెంగాల్ 88 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అతిత్ సేత్ 5 వికెట్లు తీయగా లుక్మన్ మెరివాలా 3 వికెట్లు తీశాడు.
మిజోరంతో జరుగుతున్న మ్యాచ్‌లో మొట్టమొదటి రంజీ మ్యాచ్ ఆడుతున్న షకీబుల్ గనీ 405 బంతుల్లో 56 ఫోర్లు, 2 సిక్సర్లతో 341 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ ఆరంగ్రేటం మ్యాచ్‌లో త్రిబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు గనీ... బబుల్ ఖాన్ 387 బంతుల్లో 27 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 218 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.