చేతన్ సకారియా తండ్రి కరోనాతో మృతి... కొన్నాళ్ల క్రిందటే తమ్ముడి ఆత్మహత్య...

Published : May 09, 2021, 01:11 PM IST
చేతన్ సకారియా తండ్రి కరోనాతో మృతి... కొన్నాళ్ల క్రిందటే తమ్ముడి ఆత్మహత్య...

సారాంశం

రెండు రోజుల కిందటే ఐపీఎల్ డబ్బులను తండ్రి వైద్యానికి ఖర్చు చేస్తున్నానని ప్రకటించిన చేతన్ సకారియా... జనవరిలో తమ్ముడి ఆత్మహత్య...ఇంతలోనే కరోనాతో తండ్రి మృతి...

రాజస్థాన్ రాయల్స్‌తో తరుపున ఎంట్రీ ఇచ్చి, మొదటి సీజన్‌లోనే చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ బౌలర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా బారిన పడిన ఆయన తండ్రి కంజిభాయ్... తుదిశ్వాస విడిచారు.

రెండు రోజుల క్రిందటే ఐపీఎల్ 2021 డబ్బులు వచ్చాయని, వాటితో తన తండ్రికి చికిత్స చేయిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశాడు చేతన్ సకారియా. అయితే అంతలోనే తండ్రి మరణవార్త తెలిసింది. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన కంజిభాయ్ కొన్నాళ్లుగా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నాడు.

టెంపో నడిపి ఇద్దరు కొడుకులను చదివించాడు కంజిభాయ్. అయితే జనవరిలో చేతన్ సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదం నుంచి కుటుంబం ఇంకా పూర్తిగా కోలుకోకముందే కరోనా మహమ్మారి మరో ప్రాణాన్ని బలితీసుకుంది.

PREV
click me!

Recommended Stories

Ira Aery : క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్‌రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు !
Women's T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్ మధ్యలోనే స్టార్ ప్లేయర్ అవుట్.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆర్సీబీ బ్యూటీ !