బ్యాటు కూడా అవసరం లేదు, వికెట్ తీసి వీరబాదుడు బాదాడు... క్రికెట్ చిన్నోడి వీడియో వైరల్..

Published : May 09, 2021, 11:59 AM IST
బ్యాటు కూడా అవసరం లేదు, వికెట్ తీసి వీరబాదుడు బాదాడు... క్రికెట్ చిన్నోడి వీడియో వైరల్..

సారాంశం

వికెట్ స్టంప్‌తో బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన షాట్లు ఆడిన కుర్రాడు... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో...

ఓ కుర్రాడు క్రికెట్‌లో అతి కష్టమైన షాట్లను చాలా ఈజీగా అదరగొడుతున్న వీడియో... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ కుర్రాడు బ్యాటింగ్ చేసింది బ్యాటుతో కాదండోయ్... వికెట్‌ స్టంప్‌తో!.. హా... అవును..

సాధారణంగా బ్యాటుతో ఆడితేనే బాల్ మిస్ అయ్యి, వికెట్ ఎగిరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది వికెట్ స్టంప్‌తో చూడముచ్చటైన స్టైయిట్ డ్రైవ్, కవర్ డ్రైవ్, స్వీప్ షాట్, రివర్స్ స్వీప్ వంటి షాట్లను అవలోకగా ఆడేశాడు ఈ కుర్రాడు.

తన ఆటతో సచిన్, కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌ను గుర్తుకుతెస్తున్నాడని నెటిజన్లు చెబుతున్నారు. అయితే ఈ కుర్రాడు ఎవరు? ఇది ఏ ప్రాంతంలో తీసిన వీడియో అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

PREV
click me!

Recommended Stories

Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే