క్రికెటర్ భువనేశ్వర్.. యాంకర్ శ్యామలకి బంధువా..?

By telugu news teamFirst Published May 8, 2021, 11:32 AM IST
Highlights

టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్.. యాంకర్ శ్యామలకు బంధువు అవుతాడని.. అది కూడా బ్రదర్ అవుతాడంటూ నెట్టింట మీమ్ క్రియేట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారడంతో.. దానిపై యాంకర్ శ్యామల తాజాగా స్పందించారు.

టాలీవుడ్ యాంకర్ శ్యామల.. అందరికీ సుపరిచితమే. ఎన్నో టీవీ కార్యక్రమాల ద్వారా ఆమె ప్రజలకు చేరువయ్యారు. ఇటీవల ఆమె భర్త నర్సింహా రెడ్డి ఏదో చీటింగ్ కేసులో అరెస్టు కాగా.. ఆమె వార్తల్లోకి వచ్చారు. ఈ వార్త ఇంకా సద్దుమణిగిపోక ముందే.. తాజాగా.. మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

అయితే.. ఇదేమీ కాంట్రవర్సీ కాదు.. కానీ.. ఓ మీమర్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్.. యాంకర్ శ్యామలకు బంధువు అవుతాడని.. అది కూడా బ్రదర్ అవుతాడంటూ నెట్టింట మీమ్ క్రియేట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారడంతో.. దానిపై యాంకర్ శ్యామల తాజాగా స్పందించారు.

తాజాగా ఈ వార్తలపై స్పందించిన శ్యామల..అవునా..ఈ విషయం నాకే తెలియదు వాళ్లకేం తెలుస్తుంది అంటూ సెటైర్‌ వేశారు. దీంతో శ్యామల, భువనేశ్వర్‌ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ అంటూ వైరలవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. 

ఇదిలా ఉండగా... యాంకర్ శ్యామల భర్త చీటింగ్ కేసులో అరెస్టు అయ్యారు. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని నర్సింహారెడ్డిపై ఓ మహిళ  రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటీ రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు అడిగితే తనను బెదిరించడమే కాకుండా, లైంగిక వేధింపులకు కూడా గురిచేశాడని తెలిపింది.

click me!