కాన్పూర్ టెస్టుపై వ‌రుణుడి దెబ్బ, భార‌త్-బంగ్లాదేశ్ ల‌కు బిగ్ షాక్, WTC స్టాండింగ్స్‌ వివరాలు ఇవిగో

By Mahesh RajamoniFirst Published Sep 29, 2024, 6:03 PM IST
Highlights

India vs Bangladesh : కాన్పూర్ టెస్టు మ్యాచ్ ను వ‌రుణుడు దెబ్బ‌కొట్టాడు. దీంతో మ్యాచ్ మూడో రోజు కూడా ర‌ద్దు అయింది. ఇది ఇరు జ‌ట్ల‌కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకుంటే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 ​​సైకిల్‌లో ఇరు జ‌ట్ల‌కు ఇప్ప‌టి నుంచి అన్నిమ్యాచ్ లు కీల‌క‌మైన‌వి.
 

India vs Bangladesh : కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న‌ భారత్ -బంగ్లాదేశ్ రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు మాదిరిగానే 3వ రోజు కూడా పూర్తిగా వాష్ అవుట్ అయింది. రాత్రి వ‌ర్షం ప‌డ‌టంతో  ఔట్ ఫీల్డ్ మ్యాచ్ కొన‌సాగించేందుకు అనుకూలంగా లేక‌పోయింది. గ్రౌండ్ సిబ్బంది కూడా పిచ్ ను రెడీ చేయ‌డానికి త‌మ ముందున్న అన్ని ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, మధ్యాహ్నం 2 గంటల వ‌ర‌కు కూడా ఆట ఆడేందుకు పిచ్ అనుకూలంగా మార‌లేదు. దీంతో మ్యాచ్ మూడో రోజును కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్టు అంపైర్లు తెలిపారు.

డ్రా దిశ‌గా భార‌త్-బంగ్లాదేశ్ రెండో టెస్టు 

 

Latest Videos

కాన్పూర్ టెస్టు ప్రారంభం రోజు కూడా వ‌ర్షం ప‌డింది. దీని కార‌ణంగా మ్యాచ్ టాస్ కూడా అల‌స్యం అయింది. టాస్ గెలిచిన భార‌త్ ముందుకు బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో బంగ్లాదేశ్ టీమ్  తొలుత బ్యాటింగ్ చేసింది. మూడు రోజుల ఆట‌లో కేవ‌లం 35 రోజుల ఆట మాత్ర‌మే కొన‌సాగింది.  బంగ్లాదేశ్ 107-3 ప‌రుగుల‌తో ఆట‌ను కొన‌సాగిస్తోంది. వ‌ర్షం కార‌ణంగా రెండో రోజు, మూడో రోజు ఆట కొన‌సాగ‌లేదు.  నాలుగు, ఐదో రోజు ఆట కొన‌సాగే అవకాశ‌ముంది. రాబోయే రెండు రోజులు ఎలాంటి వ‌ర్షాలు లేవ‌నీ, దీంత్ మ్యాచ్ పై వ‌ర్షం ప్రభావం క‌నిపించ‌కపోవ‌చ్చున‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే ఈ మ్యాచ్ దాదాపు డ్రా కావ‌డం ఖాయం. 

రాత్రి వ‌ర్షం కుర‌వ‌డంతో కాన్పూర్ టెస్టు మూడో రోజు ఆట‌కు బ్రేక్

 

రాత్రిపూట కురిసిన వర్షం కార‌ణంగా కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో వ‌ర్షపు నీరు చేరింది. గ్రాండ్ లోని అక్క‌డ‌క్క‌డ  కొన్ని ప్రాంతాల్లో నీటి కుంటలు ఏర్పడ్డాయి. ఉదయం నుంచి త‌క్కువ‌ వర్షం కురుస్తున్నప్పటికీ తేమతో ఆటను కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. ఉదయం పూట ఆకాశాన్ని మబ్బులు కమ్ముకోవడం క‌నిపించినా మధ్యాహ్నానికి ఎండలు వ‌స్తున్నాయి. అయితే, వెట్ ఔట్ ఫీల్డ్ కార‌ణంగా మ్యాచ్ కొన‌సాగ‌లేదు.

దీంతో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆటగాళ్ళు తమ హోటల్‌కి తిరిగి వచ్చినప్పటికీ, చాలా మంది క్రికెట్ ల‌వ‌ర్స్ స్టేడియంలోనే ఉండి మ్యాచ్ తిరిగి ప్రారంభం కావాల‌ని ఆశించారు. దురదృష్టవశాత్తు మ్యాచ్ కొన‌సాగ‌డానికి అవ‌స‌ర‌మైన వెలుతురు స‌రిగ్గా లేక‌పోవ‌డం, మైదానంలో ఆడలేని పరిస్థితుల కారణంగా అధికారులు మూడో రోజు ఆటను నిలిపివేశారు. రాబోయే రెండో రోజులు మ్యాచ్ కొన‌సాగుతుంద‌ని ఆశిస్తున్నారు. 

భార‌త్-బంగ్లాదేశ్ రెండో టెస్టు మ్యాచ్ ఔట్‌లుక్ ఎలా ఉంది?

 

వాతావరణ పరిస్థితుల కారణంగా భార‌త్-బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. సోమవారం-మంగళవారం వాతావరణ సూచన ప్రకారం ఆకాశం నిర్మ‌లంగా ఉండ‌టంతో పాటు ఎండ‌లు కొట్టానున్నాయి. అదే జరిగితే మ్యాచ్ కొన‌సాగ‌డంతో పాటు దాదాపు ఇది డ్రా అయ్యే అవకాశం ఉంది. టెస్టు తొలి రోజు వెలుతురు, వర్షం అంతరాయం కారణంగా కేవలం 35 ఓవర్లు మాత్రమే మ్యాచ్ సాగింది. భారత్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత బంగ్లాదేశ్ 107/3 స్కోర్ చేయగలిగింది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో భారీ విజయం సాధించింది. రెండో మ్యాచ్ డ్రా అయిన ఇప్పటికే భారత్ 1-0 ఆధిక్యంతో సిరీస్ ను సొంతం చేసుకుంటుంది.  

ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఏ జ‌ట్లు ఏ స్థానంలో ఉన్నాయి? 

 

గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక భారీ ఇన్నింగ్స్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 ​​సైకిల్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో వారి ఐదవ విజయాన్ని నమోదు చేసిన శ్రీలంక WTC స్టాండింగ్స్‌లో మూడో స్థానంలోకి చేరింది. ఇక‌ న్యూజిలాండ్ నాలుగో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. 

బంగ్లాదేశ్‌ను తొలి టెస్టులో ఓడించిన భారత్ 71.67% పీసీటీతో WTC స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. WTC సైకిల్ లో భార‌త్ ఆడిన 10 మ్యాచ్‌లలో ఏడింటిలో విజ‌యం సాధించింది. భార‌త్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్ టీమ్ WTC 2023-25 ​​పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోకి చేరుకుంది. ఆ జ‌ట్టు 39.29% PCTని కలిగి ఉంది. బంగ్లా టీమ్ మూడు  మ్యాచ్ ల‌లో గెలిచి నాలుగు మ్యాచ్ లల‌లో ఓడిపోయింది. 

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జ‌ట్లు WTC స్టాండింగ్స్‌లో భారత్‌ కంటే  వెనుకే ఉన్నాయి. ఆస్ట్రేలియా 62.50 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. కంగారు టీమ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది విజయాలు సాధించ‌గా, మూడు ఓట‌ములు, ఒక మ్యాచ్ ను డ్రా చేసుకుంది. ఇక 42.19 పాయింట్ల శాతంతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 16 టెస్టుల్లో ఎనిమిది విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికా ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది. తొమ్మిదవ, చివరి స్థానంలో వెస్టిండీస్ వుండ‌గా, పాకిస్తాన్ రెండు విజయాలు, ఐదు పరాజయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. 

WTC స్టాండింగ్‌ కేటాాయింపులు ఎలా ఇస్తారు? 

 

కాగా, WTC స్టాండింగ్‌లకు సంబంధించి పాయింట్ల కేటాయింపు గ‌మ‌నిస్తే.. WTCలో ప్రతి విజయానికి 12 పాయింట్లు ఇస్తారు. మ్యాచ్ డ్రా అయితే, ఇరు జ‌ట్ల‌కు నాలుగు పాయింట్లు ల‌భిస్తాయి. మ్యాచ్ టై అయితే, ఇరు జ‌ట్లు ఆరు పాయింట్ల చొప్పున అందుకుంటాయి. స్లో ఓవర్-రేట్లు, ఇత‌ర మ్యాచ్ రిఫ‌రీ కార‌ణాల‌తో కూడా జ‌ట్లు పాయింట్లను కోల్పోవ‌చ్చు.


 

click me!