ఆటగాళ్లకు బీసీసీఐ షాక్ - ఐపీఎల్ లో సంచ‌ల‌న మార్పులు - క్రికెట్ ల‌వ‌ర్స్ కు పండ‌గే

By Mahesh RajamoniFirst Published Sep 29, 2024, 3:51 PM IST
Highlights

IPL 2025 New Rules : ప్లేయర్ల రిటెన్షన్ - RTM కాకుండా బీసీసీఐ - ఐపీఎల్ కౌన్సిల్ ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.  అలాగే, జట్టు పర్స్‌ను రూ. 120 కోట్లకు పెంచింది. క్యాప్డ్ ప్లేయర్‌, అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ల విష‌యంలో కూడా మార్పులు చేసిందే.  
 

IPL 2025 New Rules : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కి స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది. ప్రాంఛైజీలతో చర్చల తర్వాత బీసీసీఐ మెగా వేలానికి ముందు కీల‌క మార్పులు తీసుకువ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో ప్లేయ‌ర్ల‌కు షాక్ కూడా ఇచ్చింది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీస‌సీఐ). ఐపీఎల్  గవర్నింగ్ కౌన్సిల్ 2025 మెగా వేలం కోసం కొన్ని తాజా నిబంధనలను రూపొందించింది. ఈ మార్పులు ఐపీఎల్ ఆట‌గాళ్ల‌ వేలం ప్రక్రియను సులభతరం చేయడంక‌, ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా చేయడం వంటివి ఉన్నాయి. 

ఐపీఎల్‌లో చేరాలనుకునే ఏదైనా అంతర్జాతీయ ఆటగాడు సీజన్ ప్రారంభమయ్యే ముందు తప్పనిసరిగా మెగా వేలంలో త‌మ పేరును న‌మోదుచేసుకోవాల‌ని పేర్కొంది. వారు అలా చేయకపోతే, వారు భవిష్యత్తులో వేలం నుండి ఒక సంవత్సరం నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే అలాంటి ప్లేయ‌ర్ల ఐపీఎల్ కెరీర్ ఏడాది ఫుల్ స్టాప్ పడుతుంది. 

ఐపీఎల్ 2025 - ఆటగాళ్లకు బీసీసీఐ షాక్ 

Latest Videos

ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ ప‌లు క‌ఠిన నిర్ణ‌యాలే తీసుకుంది. కమిట్ మెంట్ ఇచ్చి బెయిల్ అవుట్ అయ్యే ఆటగాళ్లపై ఐపీఎల్ ఆడ‌టం పై బిగ్ షాకిచ్చింది. ఒక ఆటగాడు తన పేరుతో వేలం రింగ్ లోకి వ‌చ్చి, ఏదైనా ఫ్రాంచైజీ అత‌న్ని ఎంపిక చేసుకున్న త‌ర్వాత సీజన్ ప్రారంభమయ్యే ముందు అకస్మాత్తుగా అందుబాటులో లేకుండా పోయినట్లయితే వారు తర్వాతి రెండు సీజన్ల నిషేధానికి గురవుతారు. ఫ్రాంచైజీలు విశ్వసనీయమైన-నిబద్ధత కలిగిన ఆటగాళ్లను పొందేలా చూసుకోవడం, ఆకస్మికంగా ఆటగాడు అందుబాటులో లేకపోవడం వల్ల చివరి నిమిషంలో జ‌ట్లు ఇబ్బందులు ఎదుర్కొవ‌డం త‌గ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఐపీఎల్ 2025 లో కొత్త రిటెన్షన్ పాలసీ

 

 

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రిటెన్షన్ నిబంధనలను అప్‌డేట్ చేసింది. బెంగళూరులో మొత్తం 10 ఫ్రాంచైజీలతో చర్చించిన తర్వాత, జట్లు ఇప్పుడు ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చని నిర్ణ‌యించింది. ఇంత‌కుముందు రిటెన్ష‌న్ లో ఆయా జ‌ట్లు న‌లుగురు ప్లేయ‌ర్ల‌ను జ‌ట్టుతో అంటిపెట్టుకోవ‌డానికి నిర్ణ‌యించింది. ఇప్పుడు ఆ సంఖ్య‌ను పెంచ‌డంతో జ‌ట్ల‌కు లాభం చేకూర‌నుంది. జట్లు నేరుగా నిలుపుదల ద్వారా లేదా రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా తమ ప్రధాన ఆటగాళ్లను జ‌ట్టుతోనే ఉంచుకోవ‌చ్చు. ఇది వేలానికి ముందు వారు విడుదల చేసిన ఆటగాడి కోసం చేసిన అత్యధిక బిడ్‌తో సరిపోలడానికి ఫ్రాంచైజీని అనుమతిస్తుంది.

ఐపీఎల్ 2025 కోసం రిటెన్ష‌న్ స్లాబ్ లో మార్పులు 

ఒకవేళ ఫ్రాంచైజీ ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్‌లను ఉంచుకోవాలనుకుంటే మొత్తం ప‌ర్సు నుంచి మొదటి మూడు రిటెన్షన్‌ల కోసం రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత రెండు రిటెన్ష‌న్ల కోసం రూ. 18 కోట్లు, రూ 14 కోట్లు ఉంటాయి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల విషయానికొస్తే 2021 మెగా వేలంలో మాదిరిగానే రూ. 4 కోట్లతో ఉంది. దీన‌ర్థం ఏమిటంటే వేలానికి ముందు ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్‌లను, ఒక అన్‌క్యాప్ ప్లేయ‌ర్ల‌ను కోసం ఫ్రాంచైజీ మొత్తం  రూ. 120 కోట్ల పర్స్ నుండి రూ.79 కోట్లను కోల్పోతుంది. ఇక కేవ‌లం రూ. 41 కోట్లతో వేలంలోకి వెళ్తుంది. ఒక ఫ్రాంచైజీ నలుగురు క్యాప్డ్, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను రిటెన్ష‌న్ చేసుకుంటే తన పర్సులోని రూ. 69 కోట్లను కోల్పోతుంది.

మొత్తం జీతం క్యాప్ ఇప్పుడు వేలం పర్స్, ఇంక్రిమెంటల్ పెర్ఫార్మెన్స్ పే, మ్యాచ్ ఫీజులను కలిగి ఉంటుంది . 2024లో ఐపీఎల్ లో మొత్తం జీతం పరిమితి (వేలం పర్స్ + ఇంక్రిమెంటల్ పెర్ఫార్మెన్స్ పే) రూ. 110 కోట్లు. ఇప్పుడు ఐపీఎల్ 2025లో రూ. 146 కోట్లు కాగా, ఐపీఎల్ 2026లో నూ. 151 కోట్లకు పెరుగుతుంది. ఆ త‌ర్వాతి సీజ‌న్ ఐపీఎల్ 2027లో రూ. 157 కోట్లు అవుతుంది.

ఐపీఎల్ 2025 లో ఇంపాక్ట్ ప్లేయర్ కు గ్రీన్ సిగ్న‌ల్

 

 

ప‌లు ఫ్రాంచైజీల నుండి అభ్యంతరాలు, ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ఆల్‌రౌండర్ల అభివృద్ధికి హానికరం అని రోహిత్ శర్మ వంటి ఉన్నత స్థాయి ఆటగాళ్ల నుండి ఆందోళనలు ఉన్నప్పటికీ ఐపీఎల్ రాబోయే మూడు సీజన్‌లలో 2027 వరకు దానిని కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.

ఐపీఎల్ 2025లో గాయల‌లో స‌మ‌యంలో నిబంధ‌న‌లు  కూడా మార్చింది. ఐపీఎల్ 2024 వరకు ఫ్రాంచైజీలు తమ సీజన్‌లోని ఏడవ మ్యాచ్‌కు ముందు మాత్రమే గాయపడిన ఆటగాడిని భర్తీ చేయవలసి ఉంటుంది. ఐపీఎల్ 2025 నుండి లీగ్ దశలో 12వ మ్యాచ్ వరకు జట్లు ప్లేయ‌ర్ల‌ను భర్తీ  చేసుకోవ‌చ్చు. అలాగే, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లపై విస్తృత చర్చ సందర్భంగా 2008లో ప్రారంభించిన ఈ రూల్ ను 2021లో రద్దు చేసింది బీసీసీఐ. ఇప్పుడు మ‌ళ్లీ ఈ రూల్ ను పునరుద్ధరిస్తున్నట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలియజేసింది. సంబంధిత సీజన్‌కు కనీసం ఐదేళ్ల ముందు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన భారత ఆటగాళ్లను అనుమతించడంతో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లుగా వేలంలోకి వచ్చారు.

తాజా నిర్ణ‌యంతో 2019 లో వ‌న్డే ప్రపంచ కప్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిన భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించే ఎంపికను చెన్నై సూపర్ కింగ్స్ అందిస్తుంది . 2022 మెగా వేలానికి ముందు చెన్నై టీమ్ రూ. 12 కోట్లకు ధోనిని తమ రెండవ ఆటగాడిగా ఉంచుకుంది. అయితే, ఇప్పుడు సీఎస్కే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచుకోవాలంటే కేవ‌లం రూ. 4 కోట్ల ఖ‌ర్చు అవుతుంది.

click me!