రాహుల్ ద్రవిడ్ కి బీసీసీఐ స్పెషల్ బర్త్ డే విష్.. అభిమానులు ఫిదా

Published : Jan 11, 2020, 03:15 PM ISTUpdated : Jan 11, 2020, 03:30 PM IST
రాహుల్ ద్రవిడ్ కి బీసీసీఐ స్పెషల్ బర్త్ డే విష్.. అభిమానులు ఫిదా

సారాంశం

న్యూజిలాండ్ సిరీస్ లో భాగంగా ద్రవిడ్ ఆటను వీడియో రూపంలో ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఆ వీడియో ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం. పలువురు వెటరన్ క్రికెటర్లు, మాజీలు కూడా ఈ సందర్భంగా ద్రవిడ్ కి అభినందనలు తెలుపుతున్నారు.   

ఇండియన్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఈ రోజు తన 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీసీసీఐ స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా... బీసీసీఐ బర్త్ డే విషెస్ చెప్పిన విధానం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

Also Read అప్పుడది కష్టమనిపించింది, కానీ....: నవదీప్ సైనీ

న్యూజిలాండ్ సిరీస్ లో భాగంగా ద్రవిడ్ ఆటను వీడియో రూపంలో ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఆ వీడియో ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం. పలువురు వెటరన్ క్రికెటర్లు, మాజీలు కూడా ఈ సందర్భంగా ద్రవిడ్ కి అభినందనలు తెలుపుతున్నారు. 

‘హ్యాపీ బర్త్‌ డే రాహుల్‌ ద్రవిడ్‌.. వాటే లెజెండ్‌’ అని హర్భజన్‌ సింగ్‌ విష్‌ చేయగా, ‘ నువ్వొక స్ఫూర్తి, రోల్‌ మోడల్‌, లెజెండ్‌’ అంటూ మహ్మద్‌ కైఫ్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ‘  అసాధారణ క్రికెటర్‌.. ఒక మంచి మనిషి’ అంటూ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అభినందనలు తెలిపాడు. భారత అండర్‌-19, భారత్‌-ఏ జట్లకు కోచ్‌గా చేసిన ద్రవిడ్‌.. ఆపై నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. రాబోవు తరాల క్రికెటర్లకు దిశా నిర్దేశం చేస్తూ భారత్‌ క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ద్రవిడ్‌ కృషి చేస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !