దంచికొట్టిన రాహుల్: చెన్నైపై పంజాబ్ సూపర్ విక్టరీ

By Siva KodatiFirst Published May 5, 2019, 3:43 PM IST
Highlights

కెఎల్ రాహుల్ చెలరేగి ఆడడంతో పంజాబ్ సునాయస విజయం సాధించింది. అతను 36 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్స్ సాయంతో 71 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 28 బంతుల్లో 28 పరుగులు చేశాడు. 

ఐపిఎల్ 12వ ఎడిషన్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ ఎనిమిదో స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకుంది.  చెన్నై నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే పంజాబ్ ఛేదించింది.

కెఎల్ రాహుల్ చెలరేగి ఆడడంతో పంజాబ్ సునాయస విజయం సాధించింది. అతను 36 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్స్ సాయంతో 71 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 28 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ జంట తొలి వికెట్ కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 

రాహుల్, గేల్ వరుస బంతుల్లో అవుటైనప్పటికీ నికోలస్ పూర్ సమయోచితమైన బ్యాటింగ్  పంజాబ్ కు ఉపయోగపడింది. అతను 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్స్ సాయంతో 36 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో హర్భజన్ సింగ్ మూడు, జడేజా ఒక్క వికెట్ తీసుకున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముందు 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్‌కింగ్స్.. డుప్లెసిస్ 96, రైనా 53 పరుగులతో విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పరుగులు 170 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో శామ్ కరన్ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు.

చివర్లో షమీ విజృంభించడంతో చెన్నై ఆఖరి ఓవర్‌లో వరుసగా రాయుడు, కేదార్ జాదవ్ వికెట్లను కోల్పోయింది. దీంతో ఆ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయిడుప్లెసిస్ తృుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శామ్ కరన్ వేసిన అద్భుతమైన బంతికి 96 పరుగుల వద్ద డుప్లెసిస్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.స్కోరు బోర్డును పరుగులు పెట్టించే క్రమంలో రైనా ఔటయ్యాడు. 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శామ్ కరన్ బౌలింగ్‌లో అతను పెవిలియన్ చేరాడు. 

ధాటిగా ఆడిన సురేశ్ రైనా అర్ధసెంచరీ సాధించాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో రైనా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇది ఐపీఎల్‌‌లో అతనికి 39వ అర్ధసెంచరీఓపెనర్ డుప్లెసిస్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అతను హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వాట్సన్ ఔటైనా అతను తన దూకుడు కొనసాగిస్తున్నాడు.

చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షేన్ వాట్సన్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శామ్ కరన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై ఇప్పటికే ఫ్లే ఆఫ్‌కు చేరగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫ్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది

click me!