నిన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్తా.. కాదు నిన్నే: గంభీర్‌, అఫ్రిది మాటల యుద్ధం

By Siva KodatiFirst Published May 5, 2019, 1:00 PM IST
Highlights

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీలు తరుచుగా సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగుతుంటారు. ఈ క్రమంలో తాజాగా గంభీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీలు తరుచుగా సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగుతుంటారు. ఈ క్రమంలో తాజాగా గంభీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘గేమ్ చేంజర్’ పేరుతో ఇటీవల తన ఆత్మకథ పుస్తకాన్ని వెలువరించిన అఫ్రిది.. గంభీర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు.

‘గంభీర్‌కు కావాల్సినంత పొగరు ఉంది.. ఆటలో గొప్ప రికార్డేమీ లేదని పేర్కొన్నాడు. డాన్ బ్రాడ్‌మన్, జేమ్స్ బాండ్‌కు మధ్యరకంలా గంభీర్ ప్రవర్తిస్తుంటాడని.. అటిట్యూడ్ మాత్రం చాలా ఎక్కువని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

అలాగే కొన్ని శత్రుత్వాలు వ్యక్తిగతమైనవని... గంభీర్ విషయానికొస్తే.. ఓహ్ పూర్ గౌతం.. అతని అటిట్యూడ్ ప్రాబ్లం గురించి చెప్పాలి.. అతనికి పెద్దగా వ్యక్తిత్వం లేదు. గొప్ప క్రికెట్ ఆటలో అతనొక క్యారెక్టర్ మాత్రమే.. అతనికి పెద్ద రికార్డులు లేకున్నా అటిట్యూడ్ మాత్రం చాలా ఉందని అఫ్రిది రాసుకొచ్చాడు.

దీనిపై ఘాటుగా స్పందించిన అఫ్రిది... ‘ నువ్వో తమాషా వ్యక్తివి.. అది సరే కానీ.. పాకిస్తానీయులకు మా దేశం ఇంకా వైద్యపరమైన వీసాలు జారీ చేస్తూనే ఉంది. నువ్వు వచ్చావంటే తానే నా పర్సనల్ సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తానని ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన అఫ్రిది ‘‘ గంభీర్‌కు నిజంగా మతిస్తిమితం సరిగా లేదని.. అతను మా దేశం వస్తే తన ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా చికిత్స చేయిస్తా.. ఒకవేళ అతనికి వీసా సమస్య వస్తే.. తానే దగ్గరుండి వీసా ఇప్పిస్తానని అఫ్రిది పేర్కొన్నాడు. 

click me!