India Pakistan War: పీసీఎల్ మ్యాచ్‌ల‌పై ప్ర‌భావం.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కీల‌క నిర్ణ‌యం

Published : May 09, 2025, 10:31 AM IST
India Pakistan War:  పీసీఎల్ మ్యాచ్‌ల‌పై ప్ర‌భావం.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కీల‌క నిర్ణ‌యం

సారాంశం

పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) లో మిగిలిన 8 మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు తరలిస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.  

ఈ నిర్ణయం రావల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ కనిపించిన ఘటనతో పాటు, ఇతర భద్రతా కారణాల వలన తీసుకున్నట్టు PCB స్పష్టం చేసింది. ఆటగాళ్ల భద్రతే ముఖ్యమైన అంశంగా భావించి ఈ చర్య తీసుకున్నారు. ఈ నిర్ణయంపై PCB ఛైర్మన్, ఫ్రాంఛైజీ ఓనర్లు, ఫెడరల్ ఇంటీరియర్ మంత్రి మొహ్సిన్ నక్వీ లతో సమావేశాల తర్వాత తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గురువారం ఉదయం పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఒక కీలక ప్రకటన చేశారు. భారత్‌కు చెందిన 28 డ్రోన్లను పాకిస్థాన్ సైన్యం పట్టు చేసిందని, అందులో ఒకటి రావల్పిండి స్టేడియానికి దగ్గరగా క‌నుగొన్న‌ట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు. 

ఉద్రిక్త‌ల కార‌ణంగా గురువారం జరగాల్సిన కరాచీ కింగ్స్ vs పెషావర్ జల్మీ మ్యాచ్ వాయిదా ప‌డింది. పీఎస్‌ఎల్ ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ వంటి దేశాలకు చెందిన 37 మంది విదేశీ ఆట‌గాళ్లు పాల్గొన్నారు. వారి భద్రత విషయంలో ఆందోళనల నేపథ్యంలో ఈ టోర్నీని UAEకి తరలించామని PCB స్పష్టం చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?
ICC Rankings : వన్డే కింగ్ ఎవరు? రోహిత్ శర్మకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ.. కేవలం 8 పాయింట్లు !