India Pakistan War : పాకిస్థాన్ క్రికెట్ లీగ్ యూఏఈకి షిప్ట్.. భారత్ పై పిసిబి చీఫ్ నిందలు

Published : May 09, 2025, 10:21 AM IST
India Pakistan War : పాకిస్థాన్ క్రికెట్ లీగ్ యూఏఈకి షిప్ట్.. భారత్ పై పిసిబి చీఫ్ నిందలు

సారాంశం

PSLని యూఏఈకి మార్చడంపై PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే ప్రస్తుత పరిస్థితికి భారత్ కారణమంటూ నఖ్వీ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. 

India Pakistan War  ఇండియా, పాకిస్థాన్ ఉద్రక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను భద్రతా కారణాల దృష్ట్యా యూఏఈకి మారుస్తున్నట్లు ప్రకటించింది. అయితే పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇండియా వల్లే ఈ మార్పు జరిగిందని చేసిన ఆరోపణలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. పాకిస్తాన్ పదే పదే డ్రోన్ దాడులు, కాల్పుల విరమణ ఉల్లంఘనలతో ఉద్రిక్తతలను పెంచిందన్న వాస్తవాన్ని నఖ్వీ విస్మరించారా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. .

PSL మ్యాచ్‌లు మొదట రావల్పిండి, ముల్తాన్, లాహోర్‌లలో జరగాల్సి ఉండగా, ఇప్పుడు మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తారు. ఈ మార్పు పట్ల పాకిస్తానీ అభిమానులు చింతిస్తున్నట్లు నఖ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టోర్నమెంట్‌ను అంతరాయం కలిగించడానికి ఇండియా రావల్పిండి క్రికెట్ స్టేడియంను లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు.

 

 

"మా దేశీయ ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను పాకిస్తాన్ స్టేడియంలలో చూడలేకపోవడం బాధాకరం.రాజకీయాలు, క్రీడలను వేరుగా ఉంచాలనేది PCB వైఖరి. అయితే, రావల్పిండి క్రికెట్ స్టేడియంను లక్ష్యంగా చేసుకుని ఇండియా చేసిన చర్య దృష్ట్యా మిగిలిన మ్యాచ్‌లను యూఏఈకి మార్చాలని PCB నిర్ణయించింది" అని మొహ్సిన్ నఖ్వీ అన్నారు.

స్థలం మారిన మ్యాచ్‌లు:

కరాచీ కింగ్స్ vs పెషావర్ జల్మీ

పెషావర్ జల్మీ vs లాహోర్ ఖలందర్స్

ఇస్లామాబాద్ యునైటెడ్ vs కరాచీ కింగ్స్

ముల్తాన్ సుల్తాన్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్

క్వాలిఫైయర్

ఎలిమినేటర్ 1

ఎలిమినేటర్ 2

ఫైనల్

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది