టైం బ్యాడ్‌ ఉంటే ఇంతే! పుల్ షాట్ ఆడబోయి హిట్ వికెట్‌గా అవుటైన పృథ్వీ షా...

Published : Aug 05, 2023, 10:29 AM ISTUpdated : Aug 05, 2023, 10:33 AM IST
టైం బ్యాడ్‌ ఉంటే ఇంతే! పుల్ షాట్ ఆడబోయి హిట్ వికెట్‌గా అవుటైన పృథ్వీ షా...

సారాంశం

ఇంగ్లాండ్ డొమెస్టిక్ వన్డే టోర్నీలో పాల్గొంటున్న పృథ్వీ షా.. 34 పరుగులు చేసి హిట్ వికెట్‌గా అవుటైన భారత క్రికెటర్.. 

కెప్టెన్‌గా అండర్19 వరల్డ్ కప్‌ గెలిచిన పృథ్వీ షా, ఆరంభంలో తన ఆటతీరుతో మాజీ క్రికెటర్ల మన్ననలు అందుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అయితే సచిన్ టెండూల్కర్ హైట్, వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు, బ్రియాన్ లారా టెక్నిక్ మూడు కూడా పృథ్వీ షాలో ఉన్నాయని ప్రశంసలు గుప్పించాడు..

మొదటి టెస్టులో సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేసిన పృథ్వీ షా, మూడేళ్లుగా బ్యాడ్ టైమ్ ఫేస్ చేస్తున్నాడు. గాయంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో 4 మ్యాచులకు దూరంగా ఉన్న పృథ్వీ షా, 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు..

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడిన 8 మ్యాచుల్లో 13.25 సగటుతో 106 పరుగులు చేశాడు పృథ్వీ షా. ఇందులో పంజాబ్ కింగ్స్‌పై చేసిన 54 పరుగులు తీసి వేస్తే, మిగిలిన 7 మ్యాచుల్లో కలిపి 52 పరుగులే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు పృథ్వీ షా..

దీనికి తోడు మోడల్ స్వప్న గిల్‌తో గొడవ కారణంగా అనవసర వివాదాలతో వార్తల్లో నిలిచిన పృథ్వీ షా... ప్రస్తుతం ఇంగ్లాండ్ డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో పాల్గొంటున్నాడు. నార్తాంప్టన్‌షైర్ టీమ్ తరుపున ఆరంగ్రేటం చేసిన పృథ్వీ షా, 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసి మంచి ఆరంభమే దక్కించుకున్నాడు...

అయితే వాన్ మికీరన్ బౌలింగ్‌లో బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పృథ్వీ షా, బ్యాలెన్స్ కోల్పోయి కింద పడి వికెట్లను కాలితో  కొట్టేశాడు.. దీంతో హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు పృథ్వీ షా. గత ఏడాది జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేయలేకపోయాడు పృథ్వీ షా. ఫిజిక్ కోల్పోయి, భారీ ఖాయంతో కనిపిస్తున్న పృథ్వీ షా, మళ్లీ టీమ్‌లోకి రావాలంటే కనీసం ఈ టోర్నీలో అయినా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వాలి..

ఆడిలైడ్ టెస్టులో అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత పృథ్వీ షాని పూర్తిగా పక్కనబెట్టేసింది భారత జట్టు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో పాటు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి కూడా పృథ్వీ షాని పరిగణనలోకి తీసుకోవడం లేదు. టెస్టుల్లోనూ అతను రీఎంట్రీ ఇవ్వడం కష్టమే...

ఒకే రకమైన తప్పులు చేస్తూ, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో కూడా చోటు కోల్పోయిన పృథ్వీ షా... టాలెంట్ పుష్కలంగా ఉన్నా, నిర్లక్ష్యం, బద్ధకంతో దాన్ని వేస్ట్ చేసుకున్న ప్లేయర్లలో ఇప్పటికే చేరిపోయాడు. అతను ఇప్పటిదాకా కెరీర్‌పైన ఫోకస్ పెట్టకపోతే టీమిండియా మాత్రమే కాదు, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కూడా పృథ్వీ షాని మరిచిపోవడం ఖాయం.. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లౌసెస్టర్‌షైర్ జట్టు 48.4 ఓవర్లలో 278 పరుగులకి ఆలౌట్ అయ్యింది. గ్రేమ్ వాన్ బుర్రెన్ 102 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 108 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఈ లక్ష్యఛేదనలో 30 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది నార్తాంప్టన్‌షైర్. 

34 పరుగులు చేసి టాపార్డర్‌లో డబుల్ డిజిట్ స్కోరు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన పృథ్వీ షా హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు.. టామ్ టేలర్ 88 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు, కెప్టెన్ లూయిస్ మెక్‌మానస్ 54 పరుగులు చేసి పోరాడినా 48.1 ఓవర్లలో 255 పరుగులకి ఆలౌట్ అయ్యింది నార్తాంప్టన్‌షైర్...  దీంతో 23 పరుగుల తేడాతో  గ్లౌసెస్టర్‌షైర్ జట్టు విజయం అందుకుంది.

PREV
click me!

Recommended Stories

స్మృతి మంధాన vs సానియా మీర్జా : ఇద్దరిలో ఎవరు రిచ్.. ఎవరి ఆస్తులెన్ని?
IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్ !