ఎంఎస్ ధోనీ స్కూల్ ప్రీమియర్ లీగ్.. పోస్టర్ ఆవిష్కరణ, నమోదుకు చివరి తేదీ 17

By Mahesh KFirst Published Aug 5, 2023, 4:51 AM IST
Highlights

ఎంఎస్ ధోనీ స్కూల్ ప్రీమియర్ లీగ్ పోస్టర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ షేక్ రషీద్ ఆవిష్కరించారు. నాచారంలోని డీపీఎస్ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ లీగ్‌లో ఆడాలనుకునే విద్యార్థులు 7396386214, 7618703508లకు ఫోన్ చేసి 17వ తేదీలోపు నమోదు చేసుకోవాలని, 20న సెలెక్షన్స్ ఉండనున్నాయి.
 

హైదరాబాద్: ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) స్కూల్ ప్రీమియర్ లీగ్ నిర్వహించనుంది. తాజాగా, ఎంఎస్‌డీసీఏ ఇందుకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించింది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ షేక్ రషీద్ ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం)లోని ఎంఎస్‌డీసీఏ హైపర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 1లో ఆడేందుకు క్రీడాకారులు 17వ తేదీ లోపు నమోదు చేసుకోవాలి. 7396386214, 7618703508 నెంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. 20వ తేదీన సెలెక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత స్కూల్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

స్కూల్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి షేక్ రషీద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ గల క్రికెటర్లు వెలుగులోకి రావడానికి ఇలాంటి లీగ్‌లు ఉపకరిస్తాయని అన్నారు. తన బాల్యంలో ఇలాంటి ఫ్రాంచైజీ లీగ్‌లు లేవని, ఎక్కడ టోర్నమెంట్లు జరిగినా.. తానే వెతుక్కుని ఆడేవాడినని వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు సెలెక్షన్ ట్రయల్‌లో పాల్గొని లీగ్‌లో ఆడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Latest Videos

Also Read: ఇషాన్ కిషన్ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్! వన్డేల్లో ఓపెనర్‌గా సూపర్ సక్సెస్, టీ20ల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్...

డీపీఎస్ (నాచారం), పల్లవి విద్యాసంస్థల సీవోవో యశస్వీ మాట్లాడుతూ.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పేద కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి వచ్చిన రషీద్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఆయన టీమిండియాకు సారథ్యం వహించడంతోపాటు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ లీగ్‌లో ఆడేందుకు 7396386214, 7618703508 నెంబర్లకు కాల్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని వివరించారు. హైదరాబాద్‌లోని ఎంఎస్‌డీసీఏ సెంటర్‌ లలో ఈ ెల 20వ తేదీన సెలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఎంఎస్‌డీసీఏ తెలంగాణ భాగస్వామి బ్రైనాక్స్ బీ డైరెక్టర్ రషీద్ బాషా, 7 హెచ్ స్పోర్ట్స్ డైరెక్టర్ బీ వెంకటేశ్ సహా పలువురు పాల్గొన్నారు.

click me!