తండ్రి మృతి: పోలార్డ్ భావోద్వేగం, టెండూల్కర్ సంతాపం

Published : Mar 24, 2021, 07:10 PM ISTUpdated : Mar 24, 2021, 11:07 PM IST
తండ్రి మృతి: పోలార్డ్ భావోద్వేగం, టెండూల్కర్ సంతాపం

సారాంశం

వెస్టిండీస్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరోన్ పోలార్డ్ తండ్రి కన్నుమూశారు. దానిపై పోలార్డ్ భావోద్వేగానికి గురై సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. పోలార్డు తండ్రి మృతికి సచిన్ టెండూల్కర్ సంతాపం ప్రకటించాడు.

ముంబై: వెస్టిండీస్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరోన్ పోలార్డ్ తండ్రి కన్నుమూశారు. ఆయన మంగళవారంనాడు తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని పోలార్డ్ బుధవారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు సోషల్ మీడియాలో ఆయన భావోద్వేమైన వ్యాఖ్యలు పెట్టారు. 

"టాల్ బాయ్ ఇక లేరు. ప్రశాంతంగా విశ్రమించండి. ఎల్లవేళలా మిమ్మల్ని నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఎన్నో హృదయాలను గెలుచుకున్నారు. ఇక ముందు కూడా మీరు గర్వపడేలా చేస్తాను. మీరు ఎక్కడో ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నారని నాకు తెలుసు" అని పోలార్డ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దానికి ఐపిఎల్ ట్రోఫీతో తండ్రితో కలిసి ఉన్న ఫొటోను జత చేశాడు. 

పోలార్డ్ తండ్రి మృతిపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. "మీ నాన్నగారు మరణించారనే విషయం ఇప్పుడే తెలిసింది. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ఆ దేవుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు ధైర్వం ఇవ్వాలి" అని ట్విట్టర్ వేదికగా అన్నారు.

ఐపిఎల్ లో కీరోన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపిఎల్ -14వ సీజన్ ఏప్రిల్ 9వ తేదీన నుంచి ప్రారంభమవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కి, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ కు మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది.

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !