ICC World cup 2023 Final: సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి, స్టేడియంలోకి దూసుకొచ్చిన అభిమాని...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. లక్షకు పైగా అభిమానులు, స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నారు. అనుష్క శర్మ, సచిన్ టెండూల్కర్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లారు. ఇంత మంది నియంత్రించేందుకు వీలుగా దాదాపు 6 వేల మంది సెక్యూరిటీతో కట్టుదిట్టమైన రక్షణా ఏర్పాట్లు చేసింది గుజరాత్ ప్రభుత్వం..
అయితే అంతమంది కళ్లు గప్పి ఓ అభిమాని, స్టేడియంలోకి దూసుకొచ్చాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు, 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆడమ్ జంపా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో మూడో బంతి తర్వాత ఓ అభిమాని, స్టేడియంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి విరాట్ కోహ్లీని హత్తుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది, అతన్ని గ్రౌండ్ నుంచి బయటికి తీసుకెళ్లారు.
undefined
‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసి ఉన్న టీ షర్టు ధరించిన అతన్ని, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి ఆరంభంలోనే షాక్ తగిలింది. శుబ్‌మన్ గిల్ 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. ఓ ఫోర్ బాదిన శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో కీపర్ జోష్ ఇంగ్లీష్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..