India vs Australia: 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... 4 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్..
అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 7 బంతుల్లో 4 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆడమ్ జంపాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా..
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్ శర్మ వికెట్ కోసం ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేసింది ఆస్ట్రేలియా. తొలి ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి.
హజల్‌వుడ్ వేసిన రెండో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు రోహిత్ శర్మ. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్, ఫస్ట్ స్లిప్‌లో మిచెల్ మార్ష్‌కి అందలేదు. అలా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న శుబ్‌మన్ గిల్, ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు..
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో రెండు సార్లు ఫైనల్‌లో తొలి ఓవర్ బౌలింగ్ చేసిన రెండో బౌలర్‌గా మిచెల్ స్టార్క్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు 2003, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో జహీర్ ఖాన్ మొదటి ఓవర్ బౌలింగ్ చేశాడు. 2015 వరల్డ్ కప్ ఫైనల్‌లో మొదటి ఓవర్ బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్, 8 ఏళ్ల తర్వాత మళ్లీ పైనల్‌లో తొలి ఓవర్ వేశాడు.