పాక్ యువ సంచలనం.. 17ఏళ్లకే నసీమ్ షా వరల్డ్ రికార్డ్

By telugu teamFirst Published Feb 10, 2020, 8:51 AM IST
Highlights

వరస బంతుల్లో నజ్ముల్ హుస్సేన్, తైజుల్ ఇస్లామ్, మహ్మదుల్లాలాను పెవీలియన్ కి చేర్చాడు. దీంతో టెస్టుల్లో మహ్మద్ సమీ తర్వాత ఈ ఘనతను నమోదు చేసిన రెండో పాక్ ప్లేయర్ గా నిలిచాడు.  

పాకిస్తాన్ యువ పేసర్ నసీమ్ షా అదరగొట్టాడు. కేవలం 17ఏళ్లకే వరల్డ్ రికార్డు సృష్టించాడు.  టెస్టు క్రికెట్‌లో అతి పిన్న వయసులో హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గా పాకిస్థాన్‌ పేసర్‌ నసీమ్‌ షా (16 ఏండ్ల 359 రోజులు) రికార్డుల్లోకెక్కాడు. 16ఏళంల 359 రోజుల వయసులో ముగ్గురిని వరస బంతుల్లో పెవీలియన్ కి చేర్చాడు.

నసీమ్ కారణంగానే తొలి టెస్టులో పాక్ విజయంవైపు అడుగులు వేస్తోంది. వరస బంతుల్లో నజ్ముల్ హుస్సేన్, తైజుల్ ఇస్లామ్, మహ్మదుల్లాలాను పెవీలియన్ కి చేర్చాడు. దీంతో టెస్టుల్లో మహ్మద్ సమీ తర్వాత ఈ ఘనతను నమోదు చేసిన రెండో పాక్ ప్లేయర్ గా నిలిచాడు.  అలాగే 2003లో బంగ్లా ఆల్ రౌండర్ ఆలోక్ కపాలీ 19ఏళ్ల వయసులో నమోదు చేసిన అతిపిన్న వయసులో హ్యాట్రిక్ రికార్డును బద్దలు కొట్టడం విశేషం.

Also Read అండర్19 ఫైనల్: కొంచమైతే దివ్యాంశ్ సక్సేనా తలపగిలిపోయేది.....

కాగా ఈ మ్యాచ్ లో  నసీమ్‌ (4/26)తో పాటు యాసిర్‌ షా (2/33) కూడా విజృంభించడంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 126/6తో నిలిచింది. చేతిలో 4 వికెట్లు ఉన్న బంగ్లా ఇన్నింగ్స్‌ పరాజయం తప్పించుకోవాలంటే ఇంకా 86 పరుగులు చేయాల్సి ఉంది. 

ప్రస్తుతం కెప్టెన్‌ మోమినుల్‌ మక్‌ (37), లిటన్‌ దాస్‌ (0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 342/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ 445 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌ ఆజమ్‌ (143) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరగ్గా.. హరీస్‌ సోహైల్‌ (75) రాణించాడు. బంగ్లా బౌలర్లలో అబు జయేద్‌, రూబెల్‌ హుసేన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

click me!