అండర్ 19 ప్రపంచ కప్: యశస్వీ జైశ్వాల్ రికార్డుల పంట

By telugu teamFirst Published Feb 10, 2020, 7:44 AM IST
Highlights

అండర్ 19 ప్రపంచ కప్ పోటీల్లో భారత యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ రికార్డుల పంట పండించాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక సిక్సులు బాదిన మూడో బ్యాట్స్ మన్ ఘనత సాధించాడు.

పోచెఫ్ స్ట్రూమ్: దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ పోటీల్లో యశస్వీ జైశ్వాల్ రికార్డుల పంట పండించాడు.  తన అద్భుతమైన బ్యాటింగ్ ద్వారా మరో రెండు రికార్డులు సాధించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచులో జైశ్వాల్ 88 పరగుుల చేసి ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు.

అండర్ 19 ప్రపంచ కప్ పోటీలో 400 పరుగులు చేసిన జైశ్వాల్ ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అండర్ 19 ప్రపంచ కప్ పోటీల్లో ఐదు అర్థ సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు.. 

Also Read: అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్: పోరాడి ఓడిన భారత్.. విశ్వవిజేతగా బంగ్లాదేశ్

ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ బ్రెట్ విలియమ్స్ (1988), భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (2016) పేరిట ఉన్న రికార్డును జైశ్వాల్ సమం చేశాడు. గత ఆరు మ్యాచుల్లో జైశ్వాల్ వరుసగా 57, 29 (నాటౌట్), 57 (నాటౌట్),  62, 105 (నాటౌట్), 88 పరుగులు చేశాడు. 

దాంతో పాటు అండర్ 19 ప్రపంచ కప్ లో 10 సిక్సులు బాదిన జైశ్వాల్ అత్యధిక సిక్సర్లు బాధిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండు బ్యాట్స్ మన్ జాక్ బర్న్ హమ్ (2016లో 15 సిక్సులు), భారత బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ (2014లో 12 సిక్సులు) జైశ్వాల్ కున్నా ముందున్నారు.

Also Read: పాక్ ను చిత్తు చేసిన యశస్వీ జైశ్వాల్ ఓ పానీపూరీ సెల్లర్

 

4⃣0⃣0⃣: Yashasvi Jaiswal completes 400 runs in the . 👏👏

Follow the final live 👇👇 https://t.co/WK6GcTF6Ou pic.twitter.com/vwiePNHChp

— BCCI (@BCCI)
click me!