అండర్19 ఫైనల్: కొంచమైతే దివ్యాంశ్ సక్సేనా తలపగిలిపోయేది..

By telugu teamFirst Published Feb 10, 2020, 8:30 AM IST
Highlights

బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో టీమిండియా క్రికెటర్ దివ్యాంశ్ సక్సేనా తల పగిలిపోయేది.. జస్ట్ మిస్సయ్యింది. బంగ్లా బౌలర్ వేసిన బంతి నేరుగా వచ్చి దివ్యాంశ్ తలకు తగిలేది. అయితే దాని నుంచి దివ్యాంశ్ చాలా తెలివిగా తప్పించుకున్నాడు

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అండర్ 19 వరల్డ్ కప్ పూర్తయ్యింది. ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ క్రికెటర్లు దుమ్మురేపారు. టీమిండియా కుర్రాళ్లు.. శ్రమోడ్చినా ఫలితం దక్కలేదు. కప్.. బంగ్లాదేశ్ వశమైంది.

ఈ మ్యాచ్ లో తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ అక్బర్‌ అలీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.. దీంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. అయితే... బంగ్లా ఫీల్డర్ల మాయాజాలంతో మన కుర్రాళ్లు వెంటనే పెవీలియన్ బాట పట్టారు.

Also Read అండర్ 19 ప్రపంచ కప్: యశస్వీ జైశ్వాల్ రికార్డుల పంట...  

అయితే... బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో టీమిండియా క్రికెటర్ దివ్యాంశ్ సక్సేనా తల పగిలిపోయేది.. జస్ట్ మిస్సయ్యింది. బంగ్లా బౌలర్ వేసిన బంతి నేరుగా వచ్చి దివ్యాంశ్ తలకు తగిలేది. అయితే దాని నుంచి దివ్యాంశ్ చాలా తెలివిగా తప్పించుకున్నాడు. డిఫెన్స్ ఆడి బాల్ నుంచి తప్పించుకున్నాడు. లేకపోయి ఉంటే దివ్యాంశ్ తల కచ్చితంగా ఆ బాల్ దెబ్బకు పగిలిపోయేది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా... ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు విజయం బంగ్లాదేశ్ నే వరించింది. బంగ్లాదేశ్ 41 ఓవర్లకి గాను ఏడూ వికెట్ల నష్టానికి గాను 163 పరుగులు చేసింది. అక్బర్ అలీ (42), రకీబుల్ హసన్ (3) పరుగులతో ఉన్నారు. బంగ్లాదేశ్ విజయానికి 15 పరుగులు అవసరం ఉండగా.ఈ సమయంలో వాన కురవడంతో మ్యాచ్ నిలిచింది. తరువాత ఆట ప్రారంభించి.. విజయం సాధించింది. 

click me!